Chiranjeevi : చిరంజీవిపై తీవ్ర అసహ‌నం వ్య‌క్తం చేస్తున్న ద‌ర్శ‌కులు..? ఆయ‌న కామెంట్లే కార‌ణ‌మా..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లే ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌పై తీవ్రమైన వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విదిత‌మే. అమీర్‌ఖాన్ న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా తెలుగు ట్రైల‌ర్ లాంచింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చిరు.. బాలీవుడ్‌, టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు పోలిక‌లు చెప్పారు. ఇద్ద‌రినీ పోలిస్తూ.. బాలీవుడ్ ద‌ర్శ‌కుల‌ను ఆయ‌న ఆకాశానికెత్తేశారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్లు నేరుగా షూటింగ్ స‌మ‌యంలోనే డైలాగ్స్ రాస్తార‌ని.. బాలీవుడ్ ద‌ర్శకులు మాత్రం ముందుగానే డైలాగ్‌ల‌ను రెడీ చేసి ఉంచుతార‌ని.. వాటిని న‌టీన‌టులు ముందుగానే ప్రాక్టీస్ చేస్తార‌ని.. దీంతో షూటింగ్‌లో బాగా యాక్ట్ చేస్తార‌ని అన్నారు.

అయితే టాలీవుడ్ ద‌ర్శ‌కులు సెట్‌లోనే డైలాగ్‌ల‌ను రాస్తుండ‌డం వ‌ల్ల న‌టీన‌టుల‌కు అటు యాక్టింగ్.. ఇటు డైలాగ్‌ల‌పై ఒకే సారి ఫోక‌స్ పెట్ట‌డం క‌ష్టంగా మారింద‌ని అన్నారు. క‌నుక తెలుగు ద‌ర్శ‌కులు.. హిందీ వారిని చూసి నేర్చుకోవాల‌ని మొట్టికాయ‌లు వేశారు. అయితే ఆయ‌న ఇన్‌డైరెక్ట్‌గా కొర‌టాల‌ను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కొర‌టాల తెర‌కెక్కించిన ఆచార్య విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యం పాలైంది. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్‌లు లేని కొర‌టాల ఇలా చేశారేమిట‌ని మెగా ఫ్యాన్స్ సైతం మండిప‌డ్డారు. అయితే చిరంజీవి ఆచార్య ఫెయిల్యూర్ మొత్తాన్ని కొర‌టాల‌పై నెట్ట‌డం స‌రికాద‌ని.. తెలుగు ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వాస్త‌వానికి చిరంజీవి, ప‌వ‌న్ లాంటి అగ్ర హీరోలు కొంద‌రు సినిమా క‌థ‌, షూటింగ్ ల‌లో వేలు పెడ‌తార‌ని.. క‌నుక‌నే ద‌ర్శ‌కుల‌కు సొంతంగా తీసే స్వేచ్ఛ ఉండ‌ద‌ని.. కాబ‌ట్టే సినిమాలు చాలా వ‌ర‌కు ఫెయిల్ అవుతున్నాయ‌ని అంటున్నారు.

Chiranjeevi

బాల‌కృష్ణ‌, నాగార్జున, వెంక‌టేష్ వంటి వారు ద‌ర్శ‌కుల‌కు బాగా స్వేచ్ఛ‌ను ఇస్తార‌ని.. అందుక‌నే వారితో ద‌ర్శ‌కులు సినిమాలు చేయాలంటే ఆస‌క్తిని చూపిస్తార‌ని.. కానీ చిరు, ఆయ‌న ఫ్యామిలీ హీరోల‌తో సినిమాలు తీయాలంటేనే ద‌ర్శ‌కులు భ‌య‌ప‌డ‌తార‌ని అంటున్నారు. ఆచార్య విష‌యంలో కొరటాల‌ను దోషిగా చూడ‌డం మానుకోవాల‌ని చిరంజీవికి నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు. అయితే టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌పై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మాత్రం వారికి ఆగ్ర‌హాన్ని తెప్పిస్తున్నాయ‌ట‌. దీంతో వారు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌మాచారం.

అయిపోయిన స‌మ‌స్య‌ను మ‌ళ్లీ పైకి తెచ్చి అవ‌న‌స‌రంగా విమ‌ర్శ‌ల‌పాలు కావ‌డం దేనికని చిరంజీవిపై నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక కొర‌టాల ఎన్‌టీఆర్ మూవీతో స‌క్సెస్ సాధించి త‌న‌ను నిందించిన వాళ్ల‌కు బుద్ధి చెప్పాల‌ని కొంద‌రు కొర‌టాల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. మ‌రి కొర‌టాల ఏం చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM