Tollywood : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేటెస్ట్ గా ఓ హాట్ టాపిక్ హల్ చల్ అవుతోంది. ఆ ఇద్దరు నటీనటులపై అనఫిషియల్ బ్యాన్.. అనే వార్తతో మార్మోగిపోతోంది. ఇద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావడం మరో హైలెట్. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదాలు తెలుసుకున్న వీరిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు ? అనే విషయంలో వారెవరు అనేది ఇట్టే అర్థమవుతోంది. అయితే ఇండస్ట్రీ మొత్తం వీరిపై బ్యాన్ పెట్టడం లేదు. కేవలం కొంతమంది హీరోలు, నిర్మాతలు మాత్రమే బ్యాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తమపై కామెంట్స్ చేసిన వారికి తమ సినిమాల్లో పాత్రలు ఇవ్వడం లేదంటూ ఓ వాదన వినిపిస్తోంది. తమ నోరును అదుపులో పెట్టుకోకుండా మీడియా ముందు కామెంట్స్ చేయడమే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అందులోనూ వారిద్దరూ సీనియర్ నటులే కావడం విశేషం. ఓ వర్గం హీరోల గ్రూప్ అయితే తాము నటించే సినిమాలకు వీరిద్దర్ని తీసుకోవద్దని చెప్పారని అనుకుంటున్నారు. తమ సినిమాల్లో ఒక్క వేషం కూడా ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారట.
అయితే ఈ హీరోలు ఎవరూ కూడా తమ అభిప్రాయాల్ని అదుపులో పెట్టాలనే ఆలోచనను మీడియా ముందు చెప్పడానికి సిద్ధంగా లేరట. ఇప్పటికే ఓ యంగ్ హీరో సినిమా నుండి ఈ సీనియర్ ఆర్టిస్ట్ ని పక్కన పెట్టేశారని అనుకుంటున్నారు. దాదాపుగా నాలుగు రోజుల సినిమా షూటింగ్ తర్వాత వీరిని తీసేసి.. వారి ప్లేస్ లో మరో సీనియర్ కమెడియన్ ను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ మధ్యకాలంలో పాత్రలు లేక.. టీవీ షోస్ లో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్న ఓ స్టార్ కమెడియన్ కు మళ్ళీ వేషాలు ఇవ్వాలని చూస్తున్నారని టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఇలా బ్యాన్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులను మరో సినీ వర్గం తన చెంతకు చేర్చుకునే ఆలోచనలో ఉందట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…