Throat Pain : సీజన్ మారిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటాం. అలాగే గొంతులో గర గర, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలతో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలకు ప్రారంభంలోనే గుడ్ బై చెప్పాలి అంటే ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.
ఈ సీజన్ లో వచ్చే ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే చాలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. గొంతు సమస్యల నుంచి బయటపడడానికి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం.
విశ్రాంతి లేని దగ్గుకి వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది. అందుకే వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది ఒక ప్రకృతి ఔషదం. దీన్ని రోజు ఉదయాన్నే ఉడక బెట్టుకొని లేక దంచి తిన్న సరే దగ్గు లేక గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతులో ఇన్ఫెక్షన్ ఉంటే గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి గార్గిల్ చేసుకోవాలి. ఇలా చేస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గొంతు నొప్పి నివారించడానికి ఇంకొక అద్భుతమైన చిట్కా ఏంటంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కొంచెం వేడి చేసి అరచెక్క నిమ్మరసం, పావు టీస్పూన్ మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాస్ లో పోసి నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు అరస్పూన్ తేనె, 6 తులసి ఆకులను వేసి ఆ నీటిని తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలను పాటిస్తే చాలా త్వరగా గొంతు సమస్యలు తగ్గుతాయి. నిమ్మకాయ, మిరియాలు, తేనె, తులసిలో ఉండే లక్షణాలు తొందరగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ప్రతిరోజూ ఆవిరిపట్టడం ద్వారా గొంతు సమస్యలన్నింటికీ కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఉత్తమం.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…