Jr NTR : కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తెరంగ్రేటం చేసిన ఆయన హీరోగా అనేక సినిమాల్లో నటించాడు. అయితే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం పెళ్లి. ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది సినిమాలతో హిట్లు అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే నవీన్ కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతకంటే వేగంగా డౌన్ అయిపోయాడు.
సుమారు పాతిక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన అవకాశాలు తగ్గిపోవడంతో 2, 3 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అవికూడా ఫ్లాప్ అవడంతో ఆయన్ని ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతం నవీన్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. వడ్డే నవీన్ నందమూరి కుటుంబానికి అల్లుడు అన్న సంగతి చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ కొడుకులలో ఒకరైన నందమూరి రామకృష్ణ కూతురును వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ సంబంధాన్ని కూడా ఎన్టీఆర్ సెట్ చేశారట.
జూనియర్ ఎన్టీఆర్ కు వడ్డే నవీన్ మంచి స్నేహితుడని అప్పట్లో టాక్ నడిచేది. పెళ్లికి ముందే వడ్డే నవీన్ రామకృష్ణ కూతురుతో ప్రేమలో ఉండేవాడట. ఎన్టీఆర్ వల్ల ఈ పెళ్లి జరిగిందని సమాచారం. అయితే ఆ తరువాత ఏమి జరిగిందో కానీ వడ్డే నవీన్ విడాకులు ఇచ్చి వేరొక పెళ్లి చేసుకున్నాడు. నందమూరి కుటుంబంతో బంధుత్వం తెంచుకున్నాడు. కానీ నందమూరి హీరో ఎన్టీఆర్‌తో మాత్రం నవీన్ సన్నిహితంగా ఉన్నాడంట. ఈ విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…