Balakrishna : నందమూరి తారక రామారావు వారసుడిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఈ మధ్య బాలకృష్ణ ఇటు సినిమాలతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. మొన్న అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. బాలకృష్ణ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది.. టైటిల్‌లో సింహా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలో ఎక్కువగా లక్ష్మీనరసింహ, సింహా, సమరసింహారెడ్డి, బొబ్బిలి సింహం, సీమ సింహం టైటిల్ ఉండేలాగా చూస్తారు. ఓవరాల్‌గా సింహా అనే టైటిల్ పెట్టుకుంటే బాలయ్యకు ఎక్కువ హిట్ సినిమాలు పడ్డాయి.
అంతేకాకుండా ప్రతి సినిమా రిలీజ్ కి ముందు చిత్రం బృందం అంతా అప్పన్న దర్శనం చేసుకుంటారు. లేదా ఒక చిన్న సీనైనా సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరగవలసిందే. ఆయనకి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారంటే అంత నమ్మకం. ఈ నమ్మకం ఇప్పటిది కాదంటారు అక్కడి అర్చకులు. అసలు బాలయ్యకు ఈ సింహా సెంటిమెంట్ ఎక్కడ నుంచి వచ్చిందో చూద్దాం.
బాలయ్యకు సహజంగానే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఆయన ఏ విషయంలో అయినా ముహూర్తాలు చూసుకుని పనులు ప్రారంభిస్తారు. ఆయనకు విశాఖ జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే అమితమైన భక్తి. అందుకే ఉత్తరాంధ్ర ఎప్పుడు వెళ్లినా.. విశాఖ వెళ్లిన కూడా ఆయన నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా నుంచి ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సింహాద్రి అప్పన్న దైవ సన్నిధిలో ఓ సంఖ్యాశాస్త్ర నిపుణులు 369 అనే టైటిల్ పెట్టుకోమని చెప్పారట. ఈ టైటిల్ పెట్టగా ఆదిత్య 369 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ స్థలం ఆయనకు సెంటిమెంట్ గా మారిపోయింది. అప్పటినుంచి వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే ఆయన ఎంతో ఇష్టంగా భావిస్తారు. అందుకే లక్ష్మీ నరసింహ స్వామిలోని సింహ అనే టైటిల్ కలిసి వచ్చేలాగా తన సినిమాలో టైటిల్స్ పెట్టుకోవడం ప్రారంభించారు.
దానికి తగ్గట్టే.. సింహ, లక్ష్మీనరసింహ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జై సింహా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక బాలయ్య ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన కెరీర్‌లో 107వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జై బాలయ్య లేదా రెడ్డి గారు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ హీరోయిన్ కాగా మైత్రి మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108వ సినిమా పట్టాలు ఎక్కనుంది. మొత్తానికి బాలయ్య బాబు ఇటు సినిమాలు, అటు రాజకీయపరంగా దూసుకుపోతున్నారని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…