Khiladi Movie : రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రవితేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ ఈ సినిమాకు పనిచేసిన అందరినీ పొగిడారు. అందరు టెక్నిషియన్లను మెచ్చుకున్నారు. ఈ సినిమా క్రెడిట్ అంతా వారికే చెందుతున్నారు. అయితే నిర్మాత కోనేరు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ.. ప్రతి ప్రొడ్యూసర్ సినిమాకు డబ్బులు పెట్టి చూస్తూ ఊరుకోవద్దని, దగ్గరుండి అన్నీ చూసుకోవాలని, చాలా విషయాలు తెలుస్తాయని అన్నారు. ఇక దర్శకుడు రమేష్ వర్మ గురించి రవితేజ పెద్దగా మాట్లాడలేదు.
సాధారణంగా ఏ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో అయినా సరే.. నిర్మాత, దర్శకులను హీరోలు, హీరోయిన్లు, అందుకు పనిచేసినవారు మెచ్చుకుంటుంటారు. కానీ రవితేజ మాత్రం ఇందుకు భిన్నంగా కామెంట్స్ చేశారు. నిర్మాతపై ఆ విధంగా మాట్లాడారు. ఇక దర్శకుడి గురించి అయితే పెద్దగా చెప్పలేదు. దీంతో దర్శకుడు రమేష్ వర్మకు, రవితేజకు పడడం లేదనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అందుకనే రవితేజ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా సరిగ్గా హాజరు కాలేదట. డబ్బింగ్‌కు టైముకు చేరుకోలేదట. అలాగే ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొనడం లేదని తెలిసింది.
ఖిలాడి మూవీ విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసిందని.. లాభాలు బాగానే వచ్చాయని చెబుతూ నిర్మాత కోనేరు సత్యనారాయణ దర్శకుడు రమేష్ వర్మకు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. అయితే ఇదే రవితేజకు నచ్చలేదని.. సినిమా విడుదలయ్యాక అలా చేస్తే ఓకే.. కానీ విడుదలకు ముందే ఇలా చేస్తే అవనసర ఆడంబరాలకు పోయినట్లు ఉంటుందని.. రవితేజ భావించారట. కనుకనే ఆయన దర్శకుడితో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని తెలిసింది. అయితే చిత్ర యూనిట్ చెబుతున్నట్లు నిజంగానే ఈ మూవీ బాగానే బిజినెస్ చేసినట్లయితే.. సినిమా బాగా ఆడాలి. మరి ఈ మూవీ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి.
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు,…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ…