Bimbisara : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బింబిసార. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా బింబిసార నిలిచింది. కళ్యాణ్ రామ్ సహజ నటనకు.. డైరెక్టర్ వశిష్ట స్క్రీన్ ప్లే కు ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. వరుస ఫ్లాప్స్ తో కేరీర్ ను నెట్టుకొస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
తొలిసారిగా చక్రవర్తి పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వడంతో ఈ సినిమా మంచి లాభాలు సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఏకంగా నలుగురు స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారట. ఇంతకీ.. ఆ అన్ లక్కీ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. బింబిసార కథను దర్శకుడు వశిష్ఠ మొదటగా హీరో నితిన్ కు చెప్పాడట.
కానీ నితిన్ కథ విని సినిమాను రిజెక్ట్ చేశాడట. ఆ తరవాత దర్శకుడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి వివరించాడట. రామ్ కూడా ఈ కథ తనకు సెట్ అవ్వదని చెప్పి రిజెక్ట్ చేశాడట. అంతే కాకుండా వశిష్ఠ ఈ సినిమా కథను రాజ్ తరుణ్ కు సైతం వివరించాడట. రాజ్ తరుణ్ కూడా కథ విని రిజెక్ట్ చేశాడు. మరోవైపు హీరో రవితేజకు కూడా ఈ కథ చెప్పానని వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ రవితేజ ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించాడట. ఇలా చర్చలు జరుపుతున్న క్రమంలో బింబిసార సినిమా కథకు కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నలుగురు హీరోలు రిజెక్ట్ చేసిన కథతో కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…