Tollywood : టాలీవుడ్‌లో అత్య‌ధిక బ‌డ్జెట్ అయిన సినిమాలు ఇవి.. ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

Tollywood : సాధార‌ణంగా ఒక‌ప్పుడు తెలుగు సినిమాలు అంటే.. ఆరు పాట‌లు, రెండు ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్‌.. ఇలా సాగేవి. కానీ రాజ‌మౌళి రాక‌తో తెలుగు సినిమాల‌కు అర్థ‌మే మారిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న సినిమాలు అంత‌ర్జాతీయ స్థాయిలో పేరుగాంచాయి. దీంతో ఆయ‌న ఎంతో ఖ్యాతిని గ‌డించ‌డ‌మే కాక‌.. పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీస్తూ అల‌రిస్తున్నారు. బాహుబ‌లి 2 మూవీకి రూ.1900 కోట్లు వచ్చాయంటే రాజ‌మౌళి ప్ర‌తిభ ఎంత‌టిదో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

రూ.1000 కోట్ల‌ను ఒక సినిమా క‌లెక్ట్ చేస్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. కానీ దాన్ని రాజ‌మౌళి చేసి చూపించారు. ఇక ఆయ‌న సినిమాల‌కు బ‌డ్జెట్ కూడా అధికంగానే అవుతుంటుంది. ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి సినిమా అంటే హిట్ ప‌క్కా క‌నుక నిర్మాతలు ఎంత మొత్త‌మైనా చెల్లించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక రాజమౌళి మాత్ర‌మే కాకుండా ఇత‌ర ద‌ర్శ‌కులు కూడా తెలుగులో భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను తీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక బ‌డ్జెట్ అయిన చిత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tollywood

రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను మహేష్ బాబుతో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయినా ఈ సినిమాకు గాను రూ.800 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. అలాగే ప్రభాస్ తీస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాకు రూ.600 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్ అవుతోంది. ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ బ‌డ్జెట్ రూ.550 కోట్లు అయింది. పుష్ప సినిమా అత్యధిక స్థాయిలో ప్రేక్షకుల మనసును దోచుకుని హిట్ అయింది. పుష్ప 2 సినిమాకి గాను దాదాపుగా రూ.400 కోట్ల బడ్జెట్ అని అనుకుంటున్నారు.

ప్రభాస్ నటించిన సాహో సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల రికవరీ చేయలేకపోయింది. ఈ సినిమాకు రూ.350 కోట్ల బడ్జెట్ అయింది. అలాగే రాధేశ్యామ్ కు రూ.300 కోట్లు, సైరా నరసింహా రెడ్డికి రూ.300 కోట్లు, బాహుబలి 2 కి రూ.250 కోట్లు బ‌డ్జెట్ అవ‌గా.. సలార్ కు రూ.200 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఇక పుష్ప మొద‌టి పార్ట్‌కు రూ.200 కోట్ల వ‌ర‌కు అయిన‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM