ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులలో జర్నలిస్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ని ఏర్పాటు చేసింది. ఎంతో మంది జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో కరోనా బారినపడి సరైన సమయంలో వైద్యం అందక మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రెస్ క్లబ్ హైదరాబాద్ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది.
ఈ సమావేశంలో భాగంగా జర్నలిస్టులకు కోవిడ్ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ స్వాగతించింది. ఈ మేరకు శనివారం నుంచి జర్నలిస్టుల వైద్య సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
ఎవరికైతే కరోనా లక్షణాలు ఉన్నాయో వారు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా వివరాలను అందిస్తే వారికి వెంటనే వైద్య పరీక్షలు, మందులు సరఫరా, బెడ్లు మొదలైన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలలో కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని వైద్య అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…