తెలంగాణ

తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే.. 2028లో జాగృతి పార్టీ విజయం ఖాయం: కవిత సంచలన వ్యాఖ్యలు

2028 ఎన్నికల్లో జాగృతి పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న కవిత. Photo Credit: Kavitha/YouTube.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే ఆమె ఎంట్రీని అడ్డుకున్నానని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై కవిత తీవ్రంగా స్పందిస్తూ, ఆ ఆరోపణలను ఖండించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని కూడా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏమీ మిగలలేదని, తెలంగాణలో అది ఓడిపోయిన రాజకీయ శక్తిగా మారిందని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేసిన కవిత, 2028 ఎన్నికల్లో జాగృతి పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహేశ్ గౌడ్‌ను తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తూ, ఆయనకు ఉన్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ కన్వీనర్ పదవి కూడా ఇస్తానని ఎద్దేవా మేళవించిన ఆహ్వానం పంపారు.

రాజ‌కీయాల విష‌యంలో పూర్తి సీరియ‌స్‌గానే..

జాగృతి పార్టీ రాజకీయాల విషయంలో పూర్తిగా సీరియస్‌గా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి నేరుగా వెళ్లి పనిచేస్తామని క‌విత‌ తెలిపారు. ప్రజల మద్దతు, దేవుడి ఆశీర్వాదంతో తమ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించిన కవిత, జాగృతి పార్టీ భవిష్యత్తులో బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆమె తన సొంత పార్టీ ద్వారా స్వతంత్ర రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమైంది. అయితే పార్టీని అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎన్నికల బరిలో ఎప్పుడు దిగుతారు అన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదు.

అప్ప‌టి వ‌ర‌కు పార్టీ బ‌లోపేతం కోసం..

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కవిత 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే అవకాశమే ఎక్కువ. అంతకుముందే ఎన్నికల్లో పోటీ చేసి ఓడితే ఆమె రాజకీయ ప్రభావం తగ్గే ప్రమాదం ఉందని, అది కీలకమైన 2028 ఎన్నికల సమయానికి నష్టంగా మారవచ్చని వారు భావిస్తున్నారు. అప్పటివరకు పార్టీని బలోపేతం చేసి, సంస్థాగతంగా బలంగా తయారై, తన సోదరుడు కేటీఆర్‌కు రాజకీయంగా సవాల్ విసిరే వ్యూహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిల తన అన్న జగన్‌కు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేసి, ఓడిపోయినా ఆయన పరాజయంలో కీలక పాత్ర పోషించిన ఉదాహరణను వారు గుర్తుచేస్తున్నారు.

కేటీఆర్‌, హ‌రీష్ రావుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు..

ఇదే మీడియా సమావేశంలో కవిత మరోసారి కేటీఆర్, హరీశ్ రావులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమపై వ్యక్తిగతంగా విమర్శలు వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తారని, కానీ మహిళల గౌరవం, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాల్లో మాత్రం మౌనం పాటిస్తారని ఆరోపించారు. మహిళా ఐఏఎస్ అధికారులను అవమానించే విధంగా వచ్చిన కథనాలపై ఎందుకు ఖండన లేదని ప్రశ్నించారు. ఇది నాయకత్వంలోని ఖాళీతనాన్ని, మహిళల పట్ల వారి నిబద్ధత ఎంత లోపభూయిష్టంగా ఉందో బయటపెడుతోందని వ్యాఖ్యానించారు. మహా న్యూస్‌పై దాడులు జరిగితే మాత్రం వెంటనే స్పందించారని, కానీ మహిళా అధికారులను అవమానించేలా ప్రసారం చేశారనే ఆరోపణలు ఉన్న ఎన్‌టీవీపై ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని నిలదీశారు. రాజకీయ ప్రయోజనాలే మహిళా అధికారుల గౌరవం కంటే ముఖ్యమా? అని ఆమె ప్రశ్నించారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో కవిత భవిష్యత్ పాత్ర, ఆమె పార్టీ వ్యూహం, కుటుంబ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

మెగా సక్సెస్.. మెగా గిఫ్ట్! దర్శకుడు అనిల్ రావిపూడికి రూ. 1.40 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి!

అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…

Monday, 26 January 2026, 1:38 PM

గూగుల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్స్.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు అదిరిపోయే అవకాశం! అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…

Monday, 26 January 2026, 10:41 AM

ఇస్రోలో భారీ నియామకాలు.. నెలకు రూ. 2.08 లక్షల జీతం! ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్..

ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…

Sunday, 25 January 2026, 5:28 PM

సీఎం చంద్రబాబు ‘టంగ్ స్లిప్’.. 23 లక్షల కోట్ల ఉద్యోగాలంటూ వైరల్ అవుతున్న వీడియో!

ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…

Sunday, 25 January 2026, 9:55 AM

రాజా సాబ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. చిత్ర యూనిట్‌కు ప్రభాస్ గిఫ్టులు! ‘డార్లింగ్’ అంటే అంతే మరి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…

Saturday, 24 January 2026, 9:49 PM

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM