బుల్లెట్టు బండి పాట వ‌ధువు డ్యాన్స్‌కు ఫిదా.. ఆఫ‌ర్ కొట్టేసిన యువ‌తి..

August 25, 2021 12:43 PM

ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియా చేస్తున్న మహిమ అంతా ఇంతా కాదు. అందులో ఒక్క‌సారి గుర్తింపు రావాలే గానీ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోతారు. గ‌తంలో ఎంతో మంది ఇలా పాపుల‌ర్ అయ్యారు. ఇక తాజాగా మంచిర్యాల‌కు చెందిన ఆ యువ‌తి అలాగే పాపుల‌ర్ అయింది. త‌న పెళ్లి సంద‌ర్బంగా నిర్వ‌హించిన బ‌రాత్‌లో ఆమె వేసిన స్టెప్పుల‌కు ఆమెకు అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చింది.

బుల్లెట్టు బండి పాట వ‌ధువు డ్యాన్స్‌కు ఫిదా.. ఆఫ‌ర్ కొట్టేసిన యువ‌తి..

మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయకు, రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన వివాహం జరిగింది. అయితే పెళ్లి బ‌రాత్ సంద‌ర్బంగా సాయిశ్రీయ బుల్లెట్టు బండి పాట‌కు అద్భుత‌మైన రీతిలో డ్యాన్స్ చేసింది. దీంతో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

అయితే ఆమె డ్యాన్స్‌ను చూసిన స‌ద‌రు పాట నిర్మాణ సంస్థ బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్వాహకులు నిరూప.. సాయి శ్రీయతో ఫోన్లో మాట్లాడి త‌మ త‌దుప‌రి పాట‌లో న‌టించాల‌ని కోరారు. దీంతో సాయి శ్రీయ స‌రేన‌ని అంగీక‌రించింది. ఇలా ఆమె ఒక్క పాట‌తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “బుల్లెట్టు బండి పాట వ‌ధువు డ్యాన్స్‌కు ఫిదా.. ఆఫ‌ర్ కొట్టేసిన యువ‌తి..”

Leave a Comment