Bandru Shobha Rani : పాడి కౌశిక్ రెడ్డికి చెప్పు చూపించిన కాంగ్రెస్ నేత‌.. చీర‌లు, గాజులు కూడా పంపిస్తానంటూ కామెంట్..

January 15, 2026 9:13 PM

Bandru Shobha Rani : ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఒకరిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తామని.. ఏకంగా మీడియా సమావేశంలోనే చీర, గాజులను చూపించారు. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బండ్రు శోభారాణి ఆయనకు చెప్పు చూపించారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డిపై ఫైరయ్యారు. బండ్రో శోభారాణి మాట్లాడుతూ.. ‘తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉంది. మహిళలను అడ్డు పెట్టుకుని పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. పాడి కౌశిక్ రెడ్డి చీర గాజులు పంపాలి అనుకుంటే మొదట కేసీఆర్ కు పంపాలి.

ఇతర పార్టీ నాయకుల చేరికతో టీఆర్ఎస్ పుట్టింది. కేసీఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకో. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టునికి మాట్లాడు. పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి.. ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని ఆయనను విచారణకు పిలవాలి. ఆయనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరుతున్నాం. ప్రభుత్వాన్ని పడగొడతామని మీరు అన్నారు.. కానీ, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలబెడుతామంటూ వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు’ అంటూ శోభారాణి మండిపడ్డారు.

Bandru Shobha Rani strong counter to padi kaushik reddy
Bandru Shobha Rani

‘పాడి కౌశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర నీది. బిడ్డ, భార్యను అడ్డుపెట్టుకొని చనిపోతాం అని ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచావు. పాడి కౌశిక్ రెడ్డి.. పతివ్రత.. శిరోమణి లీడర్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. మహిళలను అగౌరవపరిస్తే చెప్పుదెబ్బల పాలవుతావు. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పకపోతే నిన్ను బయట తిరగనివ్వం’ అంటూ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి బుడర్ ఖాన్ లాగా మాట్లాడుతున్నాడు. భవిషత్తులో ఆయన బతుకు ఏమైతదో ఆయనకే తెల్వదు. ఎందుకంటే.. కేసీఆర్ అధికారానికి అడ్డొచ్చిన వాళ్ళను ఆగం చేసిండు. కాంగ్రేస్ పార్టీ మహిళలను గౌరవించే పార్టీ అంటూ భవానీరెడ్డి పేర్కొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now