Tejaswi Madivada : చేయాల్సినవన్నీ చేసి శ్రీరెడ్డి పత్తిత్తులా మాట్లాడుతుందేంటీ.. అంటూ ఫైర్ అయిన తేజస్వి..!

August 16, 2022 8:21 PM

Tejaswi Madivada : తెలుగు సినీ నటి, బిగ్ బాస్ భామ తేజస్వి మడివాడ గురించి అందరికీ తెలిసిందే. వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో నటిగా మారింది తేజస్వి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ తెలుగమ్మాయి అనంతరం రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్‌ క్రీమ్‌తో తొలిసారి హీరోయిన్‌గా మారింది. అలాగే బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తేజస్వి తాజాగా కమిట్‌మెంట్‌ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహించారు. ఈ సినిమాను బల్‌దేవ్ సింగ్, నీలిమా నిర్మించగా నరేష్ కుమారన్ సంగీతం అందించారు.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌ చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆగస్టు 19న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా తేజస్వి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అవకాశాలు లేకపోవడం వల్లే అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తున్నాను అని అనడం తప్పు. నాకు ఆఫర్లు ఉన్నప్పుడే నేను ఐస్‌క్రీమ్ అడల్ట్ కంటెంట్ సినిమా చేశాను. అలాగని అడల్ట్ కంటెంట్ సినిమాలు చేసిన వారంతా స్టార్స్ అయిపోతారని అనుకోవద్దు. అలాగే మా కమిట్‌మెంట్ సినిమాలో శ్రీరెడ్డి గురించి అలాగే రాం గోపాల్ వర్మ గురించి కూడా ఉంటుంది.

Tejaswi Madivada sensational comments on Sri Reddy
Tejaswi Madivada

మనకు ఏదైనా చేయాలని ఉంటే చేసేయాలి కానీ శ్రీరెడ్డి చేయాల్సినవన్నీ చేసి ఇతరులపై ఆరోపణలు చేయడం ఏంటో అర్ధం కాదు అంది తేజస్వి. ఇక తన నిజ జీవితంలో తనని ఎవరు కమిట్మెంట్ అడగలేదని అలా అడగాలన్నా కూడా భయపడేవారు అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది. కమిట్‌మెంట్‌ సినిమాలో నా క్యారెక్టర్ పేరు తేజస్వి. నా క్యారెక్టర్‌ను నేనే ప్లే చేస్తున్నాను అని తేజస్వి చెప్పు కొచ్చింది. మ‌రి తేజ‌స్వి మాట‌ల‌కు శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment