Tea Glass Scene : సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్‌గా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమాలో ఆయన సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ఈ మూవీ ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే టిక్కెట్ల ధరలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతోనే చాలా మంది థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది. అయితే ఇదిలా ఉండగా.. తాజాగా ఈ మూవీలోని ఒక సీన్ వివాదాస్పదంగా మారింది. ఆ సీన్‌ను జనసేన పార్టీని ఉద్దేశించి తీసిందని అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే..
సర్కారు వారి పాట మూవీలో.. ఒక సీన్‌లో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న ప్రభాస్ శ్రీను గొంతులోకి గాజు గ్లాస్‌ను పంపిస్తారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే గొంతులోకి గాజు గ్లాస్ వెళ్లగానే.. ఏంటండి బాబు, ఇప్పుడు ఇది ఎలా బయటకు వస్తుంది.. అని అతను ప్రశ్నిస్తాడు. దీనికి బదులుగా.. రికవరీ ఏజెంట్‌వి కదా.. రికవరీ చెయ్యి.. అంటూ మహేష్ డైలాగ్ చెబుతారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గుర్తు కూడా గాజు గ్లాసే. దీంతో ఆయనను, ఆయన పార్టీని టార్గెట్ చేసి ఆ సీన్‌ను తీశారని.. పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే అదేదో సాధారణ సీనే అని.. అందులో ఇంత రాద్ధాంతం చేయాల్సిన పనిలేదని.. మరోవైపు పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ విషయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…