Tamannah : మాస్టర్ చెఫ్‌పై యుద్ధానికి సిద్ధ‌మైన త‌మ‌న్నా.. ఎందుకో తెలుసా ?

October 24, 2021 1:52 PM

Tamannah : మిల్కీ బ్యూటీ త‌మన్నా షార్ట్ టైంలోనే అశేష‌మైన ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. స్టార్ హీరోయిన్ స్టేట‌స్ పొందిన త‌మన్నా ఇప్పుడు వెబ్ సిరీస్‌ల‌తో పాటు బుల్లితెర షోస్ కూడా చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా మాస్ట‌ర్ చెఫ్ కార్య‌క్ర‌మంతో సంద‌డి చేస్తూ వ‌స్తున్న త‌మ‌న్నాకు కార్య‌క్ర‌మం నిర్వాహ‌కులు పెద్ద షాక్ ఇచ్చారు. మాస్ట‌ర్ చెఫ్‌ షోకి ఇన్నాళ్లు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించగా, తాజాగా ఆమె స్థానంలో అనసూయను తీసుకొచ్చారు షో నిర్వాహకులు.

Tamannah reportedly proceeding against master chef for legal action

మొదట్లో మంచి టీఆర్పీ సాధించిన ఈ షో రాను రాను అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. దీంతో నిర్వాహ‌కులు అన‌సూయ‌తో ప్లాన్ చేయ‌గా, దీనిపై త‌మ‌న్నా అసంతృప్తి వ్య‌క్తం చేసింద‌ట‌. ఓ ఆంగ్ల జాతీయ దిన పత్రిక కథనం ప్రకారం.. తనను తొలగించడంపై తమన్నా తీవ్ర అసంతృప్తితో ఉందట. ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీకి తన లాయర్ చేత నోటీసులు పంపించింది. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసుల్లో పేర్కొంది.. అని వెల్లడైంది.

తమన్నా షో నుండి వెళ్ళిపోయాక జెమినీ టివి వారు ఆమెతో కమ్యూనికేషన్ లో లేరట. అయితే ఆమెకు రెమ్యునేషన్ ఎగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాలని బాకీ మొత్తం పెండింగ్ ఉందని, ఇంకా రాలేదని వినిపిస్తోంది. తన టీమ్ ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేసి, సమాధానం చెప్పటం లేదని తమన్నాకు కోపం వచ్చిందట. దాంతో తమన్నా లీగల్ యాక్షన్ కు సిద్ధమైందని అంటున్నారు. అందులో నిజమెంత అనేది తెలియాలంటే అఫిషియల్ గా ప్రకటన రావాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment