Tamannaah : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దాదాపుగా పదేళ్ళగా అగ్ర హీరోయిన్ గా నటిస్తూ బిగ్గెస్ట్ హీరోలకు జోడీగా నటించింది తమన్నా. తన సినీ కెరీర్ లో ఫస్ట్ టైమ్ నెగిటివ్ షేడ్ లో మ్యాస్ట్రోలో నటించడం విశేషం. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా ఆమె తన స్టైల్ లో అలరిస్తోంది. రీసెంట్ గా ప్రముఖ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ లో తమన్నా హోస్ట్ గా చేస్తూ బుల్లి తెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ ప్రోగ్రాం కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటోంది మిల్కీ బ్యూటీ.
కానీ ఈ ప్రోగ్రామ్ కి అనుకున్నంతగా రేటింగ్ రాకపోవడంతో ఐపీఎల్, బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు లాంటి ప్రోగ్రామ్స్ ముందు తమన్నా ప్రోగ్రామ్ హైలెట్ అవ్వలేదు. అందుకే ఇన్వెస్ట్ చేయడంలో తమన్నాకు అంత పెద్ద అమౌంట్ ఇవ్వడం నిర్వాహకులకు భారంగా మారింది. అందుకే తమన్నాతో ఉన్న సీన్స్ ని షూట్ చేసి ఆమె అకౌంట్ ను సెటిల్ చేసి పంపేశారట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.
మిగతా ప్రోగ్రామ్స్ కి కాంపిటీషన్ గా ఉండాలంటూ తమన్నాతో మాస్టర్ చెఫ్ తెలుగు ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ ప్రోగ్రాంపై అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. వేరే భాషల్లో సూపర్ సక్సెస్ అయిన ఈ ప్రోగ్రామ్ తెలుగులో క్లిక్ అవ్వలేకపోయింది. దీంతో ఈ ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ కూడా ఇకపై ఖర్చును తగ్గించేయాలని డిసైడ్ అయ్యి తమన్నాను ప్రోగ్రామ్ నుండి తప్పించాలని నిర్ణయించుకున్నారు. మరి అనసూయ హోస్టింగ్ లోనైనా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా, లేదా అనేది చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…