Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారు వీటిని తింటే ప్ర‌మాదం.. ఏయే ఆహారాల‌ను తినాలంటే..?

Blood Sugar Levels : ప్రస్తుతకాలంలో అత్యధికంగా పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ఏడాది పొడ‌వునా ప్రతి సీజన్‌లోనూ మధుమేహ వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య విషయంలోనూ, తీసుకునే ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహించాలి. మీరు తీసుకునే ఆహారమే మీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల‌ హెచ్చుతగ్గుల‌పై ప్రభావం చూపిస్తుంది. ఆహారంలో నిత్యం పోషకాల‌ను తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణంలో ఉంటాయి.

డయాబెటిస్ పేషెంట్స్ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ప్రోటీన్స్, ఉండేలా తీసుకోవటం ఉత్తమం. అయితే డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టడం మంచిది. కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారం కారణంగా మందులతో నయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

Blood Sugar Levels

డయాబెటిస్ ఉన్న వారు చక్కెర అధికంగా ఉండే పండ్లను అసలు తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారు బాగా ఎక్కువ మొత్తంలో పుచ్చకాయలు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, ఐస్ క్రీం, స్వీట్స్ తీసుకోకూడదు. ఒకవేళ డయాబెటిస్ పేషెంట్స్ పండు తినాలంటే చాలా మితంగా వాటిని తీసుకొనాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక అరటి పండు తినాలి అనిపిస్తే దానిలో సగభాగం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

మామిడి, ఖర్బూజా, ద్రాక్షా, సీతాఫలాలు, పైనాపిల్ వంటి వాటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అందువలన ఈ పండ్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన పదార్థాలు మరియు వండిన ఎర్ర మాంసం, చికెన్ తింటే డయాబెటిస్ పేషెంట్ల‌లో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బార్బెక్యూయింగ్, బ్రాయిలింగ్, గ్రిల్లింగ్, వేయించే పద్దతుల్లో వండిన మాంసం తింటే ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువగా పీచు మరియు మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. నిత్యజీవితంలో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే శరీరానికి మంచి పోషకాలు ఇవ్వడం ఎంతో అవసరం. రాగులు, సజ్జలు, అవిసెలు, ఊదలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో నిత్యం తీసుకోవాలి. చిరుధాన్యాలను అధికంగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. వీటిలో ఉండే ఎన్నో పోషకాలు గుండెజబ్బులు, డయాబెటిస్‌, రొమ్ము క్యాన్సర్ ల‌ను దరిచేరనివ్వవు. స్త్రీలల్లో వచ్చే మెనోపాజ్ సమస్యల‌ను కూడా అదుపు చేస్తాయి. క‌నుక చిరు ధాన్యాల‌ను ఎక్కువ‌గా తింటే డ‌యాబెటిస్ త‌గ్గ‌డంతోపాటు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM