వీటిని రోజూ ఒక క‌ప్పు తింటే.. గుండె పోటు అస‌లు రాదు..

September 25, 2022 1:19 PM

శనగలు.. మంచి రుచికరమైన ఆహారం. చిన్నా పెద్దా లేకుండా శనగలను అందరూ కూడా ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ కాబూలీ శెనగలలో అనేక పోషకాలు కలిగి ఉంటాయి.  శెనగలలో  ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో శెనగలు సూపర్ ఫుడ్‌గా న్యూట్రిషనిస్టులు పిలుస్తున్నారు. మన అందరి ఇళ్లలో ఎప్పుడూ నిలువ ఉండే శనగలు ఓ కప్పు తింటే గుండెకు శక్తినిస్తుంది. శాకాహారులకు శెనగలు అనేవి ఆహారంగా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. లెగ్యూమ్ జాతికి చెందిన శనగల్లో నాటు శెనగలు, కాబూలీ  శెనగలు వంటివి లభిస్తాయి. కాబూలీ శెనగలు నానబెట్టిన లేక మొలకలు వచ్చాక వాటిని పచ్చివిగా తిన్నా, వేయించుకుని, ఉడికించుకుని తిన్న ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కాబూలీ శెనగలలో విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. కాబూలీ శనగల‌లో  ప్రొటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి  శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబూలీ శనగల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది.

take kabuli chana daily one cup for these benefits

కాబూలీ శనగల్లో ప్రోటీన్,ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. కడుపు నిండిన భావన కలిగించి  ఆకలి లేకుండా చేస్తుంది. తద్వారా ఎక్కువ ఆహారం తీసుకోకపోవటం వలన బరువు తగ్గుతారు. కాబూలీ శనగల్లో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా పదిలంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనికి తోడు విటమిన్ సి, ఫైబర్ మరియు విటమిన్ బి6 కూడా గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాలలో చెడు కొవ్వును కరిగించడానికి ఎంతగానో సహకరిస్తాయి. అంతేకాకుండా గుండెపోటు సమస్యలు రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందువల్లనే నిత్యం మన ఆహారంలో ఒక గుప్పెడు కాబూలీ సెనగలు తీసుకోవడం వలన గుప్పెడంత గుండెని పదిలంగా కాపాడుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment