T20 Worldcup 2021 : దుబాయ్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 24వ మ్యాచ్ లో ఆఫ్గనిస్థాన్‌పై పాకిస్థాన్ అతి కష్టం మీద గెలుపొందింది. ఆఫ్గనిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్థాన్ వెనుకంజ వేసింది. అయితే చివర్లో టెయిలెండర్లు మ్యాచ్‌ను గెలిపించారు. దీంతో పాకిస్థాన్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఆఫ్గనిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలుపొందింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆఫ్గన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్లలో మహమ్మద్ నబీ 32 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గుల్బదీన్ నయీబ్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. పాకిస్థాన్ బౌలర్లలో ఇమాద్ వసీమ్ 2 వికెట్లు తీయగా, షహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్‌లు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లను కోల్పోయి 148 పరుగులు చేసింది. అయితే చివర్లో ఆసిఫ్ అలీ 4 సిక్సర్లు బాది పాకిస్థాన్‌కు విజయాన్ని అందించాడు. లేదంటే ఆఫ్గనిస్థాన్ చేతిలో పాక్ పరాజయాన్ని మూటగట్టుకుని ఉండేది. చివరి వరకు ఆఫ్గన్‌దే మ్యాచ్ లో పైచేయి అయింది. అయినప్పటికీ చివరి ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించింది. పాకిస్థాన్ ఆ ఓవర్‌లో పరుగులను పిండుకుంది. దీంతో ఆఫ్గనిస్థాన్‌కు ఓటమి తప్పలేదు.
పాక్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ బాబర్ అజం 47 బంతుల్లో 4 ఫోర్లతో 51 పరుగులు చేయగా, ఫఖర్ జమాన్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ రాణించలేదు. ఆఫ్గనిస్థాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, ముజీబ్ ఉర్ రహమాన్, మహమ్మద్ నబీ, నవీన్ ఉల్ హక్‌లు తలా 1 వికెట్ తీశారు.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…