T20 World Cup 2021 : దుబాయ్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 42వ మ్యాచ్‌లో నమీబియాపై భారత్ విజయం సాధించింది. నమీబియా నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో ఆ జట్టుపై భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 132 పరుగులు చేసింది. నమీబియా బ్యాట్స్‌మెన్‌లలో డేవిడ్ వెయిస్ 26 పరుగులు, స్టీఫెన్ బార్డ్ 21 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో 3 వికెట్ల చొప్పున తీశారు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్‌ను మాత్రమే కోల్పోయి 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు అర్ధ సెంచరీలతో రాణించారు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో రాహుల్ 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ 56 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింక్ 1 వికెట్ తీశాడు.
కాగా ఇప్పటికే సెమీ ఫైనల్ బెర్త్‌లు ఖరారు అయిన నేపథ్యంలో భారత్ ఆడిన ఈ మ్యాచ్ ఎలాంటి ప్రభావం చూపదు. ఈ మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ప్రధాన రౌండ్ మ్యాచ్‌లు ముగిశాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
వరల్డ్ కప్ అనంతరం టీ20లకు కెప్టెన్‌గా తప్పుకుంటానని కోహ్లి ఇది వరకే ప్రకటించిన విషయం విదితమే. దీంతో కోహ్లి భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా తప్పుకున్నాడు. కేవలం బ్యాట్స్‌మెన్‌గానే కొనసాగనున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…