గురువారం, జూన్ 11, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : ఇండియా వర్సెస్ ఇంగ్లండ్‌.. వార్మ‌ప్ మ్యాచ్‌లోనే ఇర‌గ‌దీశారు..!

T20 World Cup 2021 : యూఏఈలో ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ టోర్నీలో ప్ర‌స్తుతం క్వాలిఫ‌యింగ్ మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. అస‌లు మ్యాచ్‌లు ఈ నెల 23 నుంచి ప్రారంభం…

T20 World Cup 2021 : ఇండియా వర్సెస్ ఇంగ్లండ్‌.. వార్మ‌ప్ మ్యాచ్‌లోనే ఇర‌గ‌దీశారు..!

T20 World Cup 2021 : యూఏఈలో ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ టోర్నీలో ప్ర‌స్తుతం క్వాలిఫ‌యింగ్ మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. అస‌లు మ్యాచ్‌లు ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతాయి. ఇక భార‌త్ 24వ తేదీన పాకిస్థాన్ తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే సోమ‌వారం భార‌త్‌, ఇంగ్లండ్‌ల మ‌ధ్య దుబాయ్‌లో వార్మ‌ప్ మ్యాచ్ నిర్వ‌హించారు. ఇందులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 india won by 7 wickets against england in warm up match

మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ల‌లో జానీ బెయిర్‌స్టో (49 ప‌రుగులు), మొయిన్ అలీ (43), లివింగ్ స్టోన్ (30)లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ 3 వికెట్లు తీయ‌గా, బుమ్రా, రాహుల్ చాహ‌ర్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్ అలవోక‌గా విజ‌యం సాధించింది. ఏ ద‌శ‌లోనూ బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డ‌లేదు. ఈ క్ర‌మంలో భార‌త్ 19 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 192 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్‌, ఇషాన్ కిష‌న్‌లు అద్భుతంగా రాణించారు. 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో రాహుల్ 51 ప‌రుగులు చేయ‌గా, 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో ఇషాన్ కిష‌న్ 70 ప‌రుగులు చేశాడు. అలాగే రిష‌బ్ పంత్ (29 ప‌రుగులు) కూడా రెచ్చిపోయాడు. దీంతో భార‌త్ సునాయాసంగానే విజ‌యం సాధించింది. ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్‌, లియామ్ లివింగ్ స్టోన్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి