T20 World Cup 2021 : న్యూజిలాండ్‌పై నెగ్గితేనే.. లేదంటే అంతే.. టీమిండియాకు నేటి మ్యాచ్ చావో రేవో..!

T20 World Cup 2021 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్‌తో ఒక్క మ్యాచ్ ఓడిపోవ‌డం టీమిండియాకు ప్రాణ సంక‌టంగా మారింది. నేడు కివీస్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో క‌చ్చితంగా గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ మ్యాచ్‌లో ఓడితే.. భారత్ ఇంటి దారి ప‌ట్టాల్సిందే. సెమీస్ వెళ్ల‌కుండానే వెన‌క్కి తిరిగి వ‌స్తుంది. దీంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. టీమిండియాకు చావో, రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌కు వెళ్లాలంటే ఒక్కో గ్రూప్ నుంచి టాప్ 2 స్థానాల్లో ఉన్న రెండేసి జ‌ట్లు అర్హ‌త సాధించాలి. ఈ క్ర‌మంలో ఒక్కో టీమ్ ఇత‌ర టీమ్‌ల‌తో 5 మ్యాచ్‌ల‌ను ఆడుతుంది. వాటిల్లో నాలుగింటిలో నెగ్గితే సెమీస్‌కు వెళ్ల‌వ‌చ్చు. అయితే పాకిస్థాన్‌తో మ‌నం ఓడిపోవ‌డం, అలాగే న్యూజిలాండ్ కూడా ఓడిపోవ‌డంతో.. పాక్‌కు క‌ల‌సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో భార‌త్.. న్యూజిలాండ్‌పై క‌చ్చితంగా గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

టోర్నీలో ఇప్ప‌టికే మూడు మ్యాచ్‌ల‌లో గెలుపొందిన పాకిస్థాన్ ఇంకో మ్యాచ్ గెలిస్తే చాలు. సెమీస్‌కు వెళ్లిపోతుంది. ఉన్న‌వి చిన్న జ‌ట్లే క‌నుక పాక్‌కు పెద్ద‌గా క‌ష్టం కాదు. క‌నుక పాక్ సెమీస్‌కు క‌చ్చితంగా వెళ్తుంద‌ని చెప్ప‌ప‌వ‌చ్చు. అయితే భార‌త్‌, కివీస్‌ల‌కు మాత్రం ఈ మ్యాచ్ కీల‌కంగా మారింది.

కివీస్‌పై భార‌త్ గెలిస్తే.. అప్పుడు ఆఫ్గ‌నిస్థాన్‌, న‌మీబియా, స్కాట్లండ్‌ల‌తో గెల‌వ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. దీంతో కివీస్ గెలుపు ఒక‌టి, మిగిలిన మూడు గెలుపులు.. మొత్తం 4 విన్స్‌తో సెమీస్‌కు వెళ్ల‌వ‌చ్చు. అదే కివీస్‌తో ఓడితే.. అప్పుడు ఆ జ‌ట్టు సెమీస్‌కు వెళ్తుంది. మ‌న‌పై కివీస్ నెగ్గాక‌.. మిగిలిన చిన్న టీమ్‌ల మీద నెగ్గ‌డం న్యూజిలాండ్‌కు పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఈ క్ర‌మంలో న్యూజిలాండ్ గ‌న‌క మ‌నమీద గెలిస్తే.. ఆ జ‌ట్టు పాక్‌తో క‌ల‌సి సెమీస్‌కు అర్హ‌త సాధిస్తుంది. లేదా న్యూజిలాండ్ మీద భార‌త్ గెలిస్తే.. అప్పుడు భార‌త్‌, పాకిస్థాన్‌లు త‌మ గ్రూప్ నుంచి సెమీస్‌కు అర్హ‌త సాధిస్తాయి. మొత్తం మీద నేడు జ‌ర‌గ‌నున్న భార‌త్‌, న్యూజిలాండ్ మ్యాచ్ మ‌న‌కే కాదు, అటు కివీస్‌కు కూడా ఇంపార్టెంటే అని చెప్ప‌వ‌చ్చు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM