T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 38వ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా గెలుపొందింది. వెస్టిండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సులభంగానే ఛేదించింది. ఈ క్రమంలో విండీస్‌పై ఆసీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో కీరన్ పొల్లాడర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 44 పరుగులు చేయగా, ఎవిన్ లెవిస్ 26 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపాలు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 161 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అకియల్ హోసిన్, క్రిస్ గేల్‌లకు చెరొక వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…