T20 World Cup 2021 : శ్రీ‌లంక‌పై ఘ‌న విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా..!

T20 World Cup 2021 : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 22వ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఈ క్ర‌మంలో లంక జ‌ట్టుపై కంగారూలు 7 వికెట్ల తేడాతో గెలుపొందారు.

మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా.. శ్రీ‌లంక బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది. శ్రీ‌లంక బ్యాట్స్‌మెన్ల‌లో కుశాల్ పెరీరా, చ‌రిత్ అస‌లంక‌, భానుక రాజ‌ప‌క్స‌లు రాణించారు. కుశాల్ పెరీరా 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35 ప‌రుగులు చేయ‌గా, చ‌రిత అస‌లంక 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 35 ప‌రుగులు చేశాడు. భానుక రాజ‌ప‌క్స 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 33 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్‌, ప్యాట్ క‌మ్మిన్స్‌, ఆడం జంపాలు త‌లా 2 వికెట్లు తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 155 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల‌లో ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ 42 బంతుల్లో 10 ఫోర్ల‌తో 65 ప‌రుగులు చేసి రాణించ‌గా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 37 ప‌రుగులు చేశాడు. మ‌రో బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ 26 బంతుల్లో 1 ఫోర్‌తో 28 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో హ‌స‌రంగ డిసిల్వా 2 వికెట్లు తీయ‌గా, ద‌సున్ శ‌న‌క 1 వికెట్ తీశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM