T20 World Cup 2021 : దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పాక్ నిర్దేశించి లక్ష్యాన్ని ఆసీస్ సులభంగానే ఛేదించింది. ఓవైపు వికెట్లను కోల్పోయినప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆసీస్‌ను రక్షించారు. ధాటిగా ఆడుతూ పరుగులు తీశారు. దీంతో చివర్లో బౌండరీలు తోడయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 176 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో మహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్‌లు రాణించారు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రిజ్వాన్ 67 పరుగులు చేయగా, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో జమాన్ 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే కెప్టెన్ బాబర్ ఆజమ్ 34 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపాలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లను కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేయగా, మార్కస్ స్టాయినిస్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాట్స్‌మన్ మ్యాథ్యూ వేడ్ 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాక.. ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు చేరుకుంది.
ఇక ఇప్పటికే ఇంగ్లండ్ మీద గెలిచిన న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకోగా.. ఆ జట్టుతో ఆసీస్ తలపడనుంది. కివీస్, ఆసీస్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఈనెల 14వ తేదీన దుబాయ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…