Sunil : సునీల్ సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలిలో రాణిస్తున్నాడు. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తర్వాత హీరోగా ఇప్పుడు పుష్పతో విలన్‌గా కూడా మారాడు. తెలుగు సినిమాలో గోదావరి యాసతో మాట్లాడే హాస్య నటుడిగా బెస్ట్ ఆప్షన్ అయిన సునీల్.. నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు వంటి అనేక సినిమాల్లో హాస్యనటుడిగా అలరిస్తూనే అందాల రాముడు, మర్యాదరామన్న వంటి అనేక సినిమాల్లో హీరోగా నటించాడు.
సుమారుగా 200 సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన సునీల్ తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పలో విలన్ గా నటించి అదరగొట్టాడు. మంగళం శీను పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి మెప్పించాడు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా విలన్‌గా చేసిన సునీల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుపై తనకున్న అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు.
మహేష్ బాబు గురించి చెబుతూ.. ఆయనను ‘గొడ్డు’తో పోల్చాడు. చూడడానికి క్యూట్ గా యంగ్ జేమ్స్ బాండ్ లా కనిపిస్తాడు గానీ, గొడ్డు కష్టం పడతాడని అన్నాడు. అలాగే ముఖ్యంగా ఫైట్స్ లో అయితే మూడు, నాలుగు ఫ్లోర్స్ లో రోప్ లు కట్టేసి వేలాడదీస్తారు, ఇక గొడ్డే, అది అయ్యే దాకా అంతలా కష్టపడతారని అన్నారు. అలాగే మహేష్ బాబు ఓ డైరెక్టర్ ను నమ్మితే ఇంక లైఫ్ ఇచ్చేస్తాడు, అది తనకు బాగా నచ్చే గుణమని చెప్పుకొచ్చాడు సునీల్. ప్రస్తుతం సునీల్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…