Sudeepa : సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు బాల్యంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ కలిసి నటించిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గానూ, అటు కామెడీ కమర్షియల్ గానూ నిలిచింది.
ఈ సినిమాలో ముఖ్యంగా వెంకటేష్, ఆర్తీ అగర్వాల్, ప్రకాష్ రాజ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో పింకీ పాత్రకి కూడా అంతే క్రేజ్ వచ్చింది. కడుపుబ్బా నవ్వుకునేలా డైలాగ్స్ తో, యాక్షన్ కామెడీతో ప్రేక్షకులకు చేరువైంది. ముఖ్యంగా హీరో వెంకటేష్ తో చెప్పిన డైలాగ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందంతో చేసిన కామెడీ కూడా పాపులారిటీని సంపాదించుకుంది.
ఈమె అసలు పేరు సుదీప. కానీ నువ్వు నాకు నచ్చావ్ సినిమా నుండి పింకీగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈమె పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. సుదీప పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు కళాకారుల కుటుంబానికి చెందిన వాళ్ళు.
ఆమె తాత కిలాడీ సత్యం. ప్రముఖ కళాకారుడు. ఆయనకు సినిమాల్లో ఎన్నో పరిచయాలు ఉండటంతో సుదీపను ఫస్ట్ టైమ్ 1994 లో మోహన్ బాబు యాక్ట్ చేసిన ఎం. ధర్మరాజు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ రంభ చెల్లెలిగా నటించింది.
ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరిగింది. ఆ టైమ్ లో ఓ చిన్నపాప రోల్ కావాలి. దీంతో డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి సుదీపను చూసి ఆ పాత్రకు అవకాశం ఇచ్చారు. నెక్ట్స్ అల్లుడుగారు వచ్చారు, మా అన్నయ్య లాంటి మూవీలలో సుదీప నటించింది.
నువ్వు నాకు నచ్చావ్ సినిమా నుండి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్, లెజెండ్ లాంటి సినిమాల్లో నటించింది. ఎంబీఏ పూర్తి చేసిన సుదీప.. శ్రీరంగనాథన్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యింది. బుల్లితెర సీరియల్స్ లో కూడా సుదీప యాక్ట్ చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…