Star Actress : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు చెందిన చిన్ననాటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ ఫోటోలను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారి ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా.. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషలకు చెందిన చిత్రాల్లో నటించింది. మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ టైప్ ఆడియన్స్‌కు దగ్గరైంది. ఇంకా ఈమె ఎవరో కనిపెట్టలేదా..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో స్నేహ కూడా ఒకరు. ఈమె అక్టోబర్ 12, 1981వ తేదీన జన్మించింది. ఈమెది ముంబై. తెలుగు కుటుంబమే కానీ అక్కడ సెటిల్ అయ్యారు. ఈ క్రమంలోనే స్నేహ నిలపక్ష అనే మళయాళ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత టాలీవుడ్ లవర్ బాయ్‌గా పేరుగాంచిన తరుణ్‌కు జోడీగా అప్పట్లో ప్రియమైన నీకు అనే మూవీలో నటించింది. ఈ మూవీ టైటిల్ సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తరువాత స్నేహకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఇక స్నేహ తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరైంది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె చూపులకు చాలా అమాయకంగా కనిపిస్తుంది. ఇక స్నేహ తన కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. వెంకీ, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు వంటి సినిమాల్లో నటించగా.. అవి హిట్ అయ్యాయి. దీంతో అప్పట్లో ఈమె హీరోలకు ఫేవరెట్ హీరోయిన్ అయింది. ఇక స్నేహ చిన్ననాటి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…