SS Rajamouli : రాజ‌మౌళి మొద‌టి సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వ‌ర‌కు.. ఒక్కో సినిమాకు పెట్టిన ఖ‌ర్చు.. వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ఎంతో తెలుసా..?

SS Rajamouli : శిల‌ను చెక్కిన‌ట్టు త‌న ప్ర‌తి సినిమాని అద్భుతంగా చెక్కుతూ జ‌క్క‌న్నగా అభిమానుల చేత పిలిపించుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. ఓటెమెరుగ‌ని విక్ర‌మార్కుడు ఈయ‌న‌. అక్టోబర్ 10, 1973వ సంవత్సరంలో కర్ణాటకలోని రాయచూరులో జన్మించిన రాజ‌మౌళి ప్ర‌తి సినిమాకి ప్రాణం పెట్టి పని చేస్తాడు. అందుకే ఆయ‌న‌ చిత్రాలు అంత పెద్ద హిట్ అవుతున్నాయి. సినిమాల్లోకి రాక‌ముందు రాజ‌మౌళి సీరియ‌ల్స్‌కి ప‌ని చేశాడు.

SS Rajamouli

బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా పేరు ప్ర‌ఖ్యాతులు అందుకున్న రాజ‌మౌళి త‌న‌ సినిమాల‌తో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్ల‌లు దాటించేలా చేశాడు. ఇక జక్కన్న డైరెక్షన్ లో రామ్ చరణ్-ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). విడుదలకు ముందే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా మార్చి 25న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే అత్యధిక కలెక్షన్లను సాధిస్తూ వ‌స్తోంది.

ఇక రాజమౌళి స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమా నుండి మొద‌లైన ప్ర‌యాణం అప్ర‌తిహ‌తంగా ముందుకు సాగుతోంది. త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌నుండ‌గా, రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్ వేద్దాం.

రాజ‌మౌళి తీసిన మొద‌టి సినిమా స్టూడెంట్ నం.1కు రూ.3 కోట్లు ఖ‌ర్చు అయింది. రూ.11 కోట్లు వ‌చ్చాయి. అలాగే సింహాద్రికి ఖర్చు రూ.8 కోట్లు కాగా.. వసూళ్లు రూ.26 కోట్లు వ‌చ్చాయి. ఇక నితిన్‌తో తీసిన సై మూవీకి రూ.5 కోట్లు ఖ‌ర్చు కాగా.. వసూళ్లు రూ.10 కోట్లు వచ్చాయి. అదేవిధంగా ప్ర‌భాస్‌తో తీసిన ఛత్రపతికి రూ.10 కోట్లు ఖ‌ర్చు కాగా.. రూ.21 కోట్లు వ‌సూలు చేసింది. ఇక ర‌వితేజ‌తో తీసిన విక్రమార్కుడు మూవీకి మొత్తం బ‌డ్జెట్ రూ.11 కోట్లు అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మొత్తం రూ.20 కోట్ల‌ను వ‌సూలు చేసింది.

త‌రువాత ఎన్‌టీఆర్‌తో క‌లిసి రాజ‌మౌళి య‌మ‌దొంగ సినిమాను తీయ‌గా.. దీనికి రూ.18 కోట్లు ఖ‌ర్చు అయింది. రూ.29 కోట్లు వ‌సూలు అయ్యాయి. రామ్ చ‌ర‌ణ్‌తో తీసిన మ‌గధీరకు రూ.44 కోట్లు ఖ‌ర్చు కాగా.. వసూళ్లు రూ.151 కోట్లు వ‌చ్చాయి. ఇక సునీల్‌తో తీసిన మర్యాద రామన్నకు రూ.14 కోట్లు బ‌డ్జెట్ అయింది. ఇది రూ.29 కోట్ల‌ను రాబ‌ట్టింది. త‌రువాత తీసిన ఈగ‌కు రూ.35 కోట్లు ఖ‌ర్చ‌యింది. ఈ మూవీ రూ.43 కోట్ల‌ను వ‌సూలు చేసింది. బాహుబ‌లి మొద‌టి పార్ట్‌కు రూ.136 కోట్లు కాగా రూ.602 కోట్ల‌ను రాబ‌ట్టింది.

బాహుబ‌లి 2వ పార్ట్‌కు రూ.250 కోట్లు ఖ‌ర్చు కాగా ఈ సినిమా రూ.1800 కోట్ల‌ను రాబ‌ట్టింది. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసిన సినిమాగా ఈ మూవీ రికార్డుల‌ను సృష్టించింది. ఈ మూవీ క‌లెక్ష‌న్ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మూవీ కూడా క‌నీసం స‌మీపించ‌లేక‌పోయింది. ఇక రాజ‌మౌళి లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కు బ‌డ్జెట్ రూ.550 కోట్లు కాగా.. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1120.10 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఇలా రాజ‌మౌళి త‌న కెరీర్‌లో అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌నే అందించారు. అయితే రాను రాను ఆయ‌న సినిమాల‌కు బ‌డ్జెట్ పెరుగుతుండడంతోపాటు క‌లెక్ష‌న్లు కూడా అదే స్థాయిలో వ‌స్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్‌కు రూ.550 కోట్లు పెట్టారు క‌నుక మ‌హేష్‌తో తీయ‌బోయే సినిమాకు ఎంత బ‌డ్జెట్ అవుతుందో చూడాలి. క‌చ్చితంగా ఆర్ఆర్ఆర్ క‌న్నా ఎక్కువ బ‌డ్జెట్‌తోనే మ‌హేష్ సినిమాను రాజ‌మౌళి తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM