Srikanth : ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, కీర్తి సురేష్, మంచు లక్ష్మీ.. తాజాగా చిరంజీవి కోవిడ్ బారిన పడ్డారు. ఇక హీరో శ్రీకాంత్ కూడా కరోనా బారిన పడినట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వివరాలను వెల్లడించారు.
తనకు దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ అని తేలిందని అన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని శ్రీకాంత్ కోరారు.
తాను అన్ని జాగ్రత్తలను తీసుకున్నానని.. అయినప్పటికీ కరోనా సోకిందని శ్రీకాంత్ తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దని.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని.. పాజిటివ్ అని తేలితే చికిత్స తీసుకోవాలని అన్నారు. కాగా శ్రీకాంత్ గత వారం కిందట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల ఆయన నటించిన అఖండ మూవీ భారీ హిట్ అయింది. ఇందులో ఆయన తొలిసారిగా విలన్ పాత్ర పోషించి మెప్పించారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…