Sreemukhi : నిజామాబాద్ పిల్ల శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. శ్రీముఖి యాంకర్ అవడానికి ముందే సినిమాల్లోకి ప్రవేశించింది. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’తో నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకుంది.
పటాస్‌తో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంటుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామని ఫన్నీ గేమ్ ఆడింది.
నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది అని శ్రీముఖి అడగ్గా.. మీకు ఇదివరకే పెళ్లయిందంటూ సమాధానం వచ్చింది. ఇది చూసి షాక్ అయిన శ్రీముఖి తొక్కా.. అంటూ రియాక్షన్ ఇచ్చింది. మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శ్రీముఖికి దిమ్మ తిరిగే షాక్ తగిలిందని అంటున్నారు.
ఈ అమ్మడు గతంలో తన పెళ్లి గురించి స్పందిస్తూ 31 ఏళ్ల వయస్సు తర్వాత ఆలోచిస్తానని అంది. డబ్బులు బాగా ఉండి.. అందంగా ఉండే వాడు తనకు వరుడిగా కావాలంటూ.. సమాధానం ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…