Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ మూవీ పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఈ బ్యూటీ పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో శ్రీలీల అంటే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి.
అలాగే బాలయ్య, మహేష్ బాబు, శర్వానంద్, నితిన్ సినిమాల్లో కూడా నటిస్తోంది అందాల భామ. ఇప్పటికే ఈ చిన్నదాని ఖాతాలో ఎన్నో క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న ధమాకాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మూవీలో కూడా హీరోయిన్ గా చేస్తోంది శ్రీలీల. ఇంకా బాలకృష్ణ అనిల్ రావిపూడిలతోపాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ నుంచి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అఖండతో సంచలన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను ఫైనల్ చేశారు. త్వరలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…