Sr NTR : ఒకే టైటిల్‌తో వ‌చ్చిన ఎన్టీఆర్‌, నాగార్జున సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?

Sr NTR : ఒక్కోసారి కథ డిమాండ్ ను బట్టి దర్శక నిర్మాతలు సినిమా టైటిల్ పెడుతూ ఉంటారు. మరికొందరు కథకు సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం టైటిల్ ను సెట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకే కథకు పేర్లు మార్చడం కూడా జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే కథలు వేరైనా ఒకే పేరుతో వచ్చిన అనేక సినిమాలు మన చిత్ర పరిశ్రమలో ఉన్నాయి.

ఇలా కథ వేరైనా ఒకే పేరుతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా. తెలుగు తెరకు ఆరాధ్య దైవం అయిన‌ నందమూరి ఎన్టీ రామారావు, అక్కినేనివారి సినీ వారసుడిగా వెండితెరకు పరిచయమైన నాగార్జున చిత్రాలు. ఇరువురు వేర్వేరుగా నటించిన ఎదురులేని మనిషి అనే ఒకే టైటిల్ తో విడుదలైన చిత్రాలు.

Sr NTR

కె.బాపయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి 1975 డిసెంబర్ 12 న రిలీజ్ అయ్యింది. చలసాని అశ్వనీదత్ నిర్మాణ సారథ్యం వహించిన తొలి చిత్రమిది. శేఖర్ (ఎన్టీఆర్) తండ్రిని తన బాల్యంలో రంగ మరియు సర్కార్ అనే ఇద్దరు దుర్మార్గులు హత్య చేస్తారు. ఆ హత్య చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకొని  శేఖర్ తన తమ్ముడు అయిన‌ గోపితో కలిసి పారిపోతాడు. ఆ తర్వాత శేఖర్ మరియు గోపీలు విడిపోవడం జరుగుతుంది.

ఒకవైపు తండ్రిని చంపిన హంతకుల మీద పగసాధించాలి అన్న పట్టుదల, మరో పక్క దూరమైన తమ్ముడిని ఎలాగైనా కలుసుకోవాలి అని శేఖర్ ప్రయత్నిస్తాడు. ఇక స్మగ్లర్ల కార్యకలాపాలను అడ్డుకుంటూ తన తమ్ముడిని ఎలా కలుసుకున్నాడు అనేది ఎన్టీఆర్ ఎదురులేని మనిషి చిత్ర కథాంశం. 2001లో నాగార్జున హీరోగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఎదురులేని మనిషి. ఈ చిత్రంలో నాగార్జున సరసన సౌందర్య, షెహనాజ్ హీరోయిన్స్ గా నటించారు. కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, యమున, అచ్యుత్  ముఖ్య పాత్రలలో నటించడం జరిగింది. ఈ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయంలో కనిపించారు.

ఊరికి పెద్దమనిషి అయిన‌ సూర్యమూర్తి (నాగార్జున) తన తాత, బామ్మ‌, ఒక పాపతో కలిసి ఉంటాడు. సూర్య మూర్తి రూపాల్ని పోలి ఉండే అతని తమ్ముడు సత్య హైదరాబాద్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని ఊరికి వస్తాడు. ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని భీష్మించుకు కూర్చున్న తన అన్నయ్యకు ఎలాగైనా పెళ్లి చేయాలి అని సత్య భావిస్తాడు. సత్య తన అన్న సూర్యమూర్తిపై పగ పెంచుకున్న వసుంధర (సౌందర్య) ని ఇచ్చి అన్నకు పెళ్లి చేస్తాడు.

వసుంధర సూర్య‌మూర్తిని తప్పుగా అర్థం చేసుకొని తన తప్పును సరిదిద్దుకునే దిశగా ఈ చిత్ర కథాంశం నడుస్తుంది. అయితే ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ మరియు నాగార్జున చేసిన చిత్రాలలో ఎన్టీఆర్ నటించిన ఎదురులేని మనిషి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇక నాగార్జున నటించిన ఎదురులేని మనిషి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేకపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM