Soundarya : సౌంద‌ర్య ఆఖ‌రి మాట‌లు.. ఆమె మ‌ర‌ణం వెనుక ఉన్న మిస్ట‌రీ ఇదే.. అస‌లు ఆ రోజు ఏం జ‌రిగింది..?

Soundarya : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సౌంద‌ర్య గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎన్నో చిత్రాల్లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందింది. ఈమె 12 ఏళ్ల త‌న సినీ కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో న‌టించింది. భార‌తీయ భాష‌లకు చెందిన అనేక సినిమాల్లో న‌టించిన సౌంద‌ర్య జూనియ‌ర్ సావిత్రిగా పేరుగాంచింది. ఈమె అస‌లు పేరు సౌమ్య‌. బాల‌న‌టిగా కూడా యాక్ట్ చేసింది. ఎంబీబీఎస్ మొద‌టి సంవ‌త్స‌రం విద్య‌ను అభ్య‌సిస్తుండ‌గా.. ఈమెకు 1992లో గంధ‌ర్వ అనే చిత్రంలో న‌టించేందుకు అవ‌కాశం ల‌భించింది. దీంతో ఆమె చ‌దువును మ‌ధ్య‌లోనే ఆపేయాల్సి వ‌చ్చింది.

ఇక సౌంద‌ర్య తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆమె న‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఎలాంటి గ్లామ‌ర్ షో చేయ‌క‌పోయినా ఆమెకు అప్ప‌ట్లో అవ‌కాశాలు పుష్క‌లంగా వ‌చ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్‌గా పేరుగాంచింది. క‌న్న‌డ‌, త‌మిళం, తెలుగు, మ‌ళ‌యాళం, హిందీ భాష‌ల‌కు చెందిన చిత్రాల్లో ఈమె న‌టించింది. ఇక హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి సూర్య‌వంశ్ అనే మూవీలో న‌టించింది.

Soundarya

సౌందర్య.. గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతోపాటు పలు పురస్కారాల‌ను అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయా చిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది. కాగా సౌంద‌ర్య 2004 ఏప్రిల్ 17న విమాన‌ ప్రమాదంలో మరణించింది.

అప్ప‌ట్లో ఈమె బీజేపీలో చేరింది. దీంతో ఎన్నిక‌ల ప్ర‌చారానికి కరీంన‌గ‌ర్ రావ‌ల్సి ఉంది. అప్ప‌ట్లో క‌రీంన‌గ‌ర్ ఎంపీగా బీజేపీ నుంచి సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు బ‌రిలో ఉన్నారు. దీంతో ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం సౌంద‌ర్య బెంగ‌ళూరు నుంచి క‌రీంన‌గ‌ర్‌కు విమానంలో బ‌య‌ల్దేరింది. ఏప్రిల్ 17న బెంగ‌ళూరులోని జ‌క్కూరు విమానాశ్ర‌యంలో త‌న సోద‌రుడు అమ‌ర‌నాథ్‌తో క‌లిసి ఆమె చార్ట‌ర్డ్ ఫ్లైట్ ఎక్కింది. అప్ప‌టికే ఆమె కుటుంబ స‌భ్యుల‌తోపాటు అమ‌ర‌నాథ్ భార్య‌, పిల్ల‌లు ఉన్నారు. వారికి వారు వీడ్కోలు ప‌లికారు. కానీ అదే వారికి చివ‌రి వీడ్కోలు అవుతుంద‌ని ఊహించ‌లేక‌పోయారు.

 

ఇక చార్ట‌ర్డ్ ఫ్లైట్‌లోకి ఎక్క‌గానే కొన్ని నిమిషాల్లోనే ఆ విమానం కూలిపోయింది. ప‌క్క‌నే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణ‌లో కుప్పకూలిపోయింది. అయితే విమానం కూలిన త‌రువాత ఆ శ‌బ్దానికి అక్క‌డికి చేరుకున్న సిబ్బంది అందులో ఉన్న‌వారిని బ‌య‌ట‌కు తీయాల‌ని భావించారు. సౌంద‌ర్య‌, ఆమె సోద‌రుడు అమ‌ర‌నాథ్, ఇంకో ఇద్ద‌రు ఏం జ‌రిగింది.. అంటూ స‌హాయం కోసం అర్థించారు. అయితే సిబ్బంది అక్క‌డికి చేరుకునే లోపే కింద ప‌డిన విమానం మొత్తం మ‌ళ్లీ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో అందులోని వారంద‌రూ స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. త‌రువాత 30 నిమిషాల‌కు గానీ వారు మంట‌లు ఆర్ప‌లేక‌పోయారు. అనంత‌రం మృత‌దేహాలు గుర్తు ప‌ట్ట‌రాని విధంగా ఉండ‌డంతో వారి దుస్తులు, ఇత‌ర ఆన‌వాళ్ల‌తోపాటు డీఎన్ఏ టెస్టు ఆధారంగా మృత‌దేహాల‌ను గుర్తించారు.

కాగా సౌంద‌ర్య తాను న‌టించిన అమ్మోరు, అంతఃపురం, రాజా, ద్వీప‌, ఆప్త‌మిత్ర సినిమాల‌కు గాను ఫిలింఫేర్ పుర‌స్కారాల‌ను అందుకుంది. అలాగే ఆమె చ‌నిపోయే నాటికే ఎన్నో అనాథాశ్ర‌మాల‌ను ద‌త్త‌త తీసుకుని చిన్నారుల సంక్షేమాన్ని చూసింది. ఆమె చ‌నిపోయాక 2009లో డిసెంబ‌ర్ 3వ తేదీన ఆమె ఆస్తిని అంద‌రూ స‌మానంగా పంచుకోవాల‌ని కోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇలా వెండితెరపై ఇంకా ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న ఓ తార అర్థాంత‌రంగా నేల‌రాలింది. సౌంద‌ర్య అంటే ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కులు అభిమానిస్తూనే ఉంటారు. ఆమె చ‌నిపోయినా సినిమాల రూపంలో మాత్రం ఆమె బ‌తికే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM