Whatsapp : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు షాకిచ్చింది. ఇకపై కొన్ని రకాల ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూఏ బీటా ఇన్‌ఫో అనే వాట్సాప్ ట్రాకర్ ఈ వివరాలను తెలియజేసింది. ఇకపై ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 ఉన్న ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. కనుక యూజర్లు కనీసం ఐఓఎస్ 12 వెర్షన్ ఉన్న ఐఫోన్లను అయినా సరే వాడాల్సి ఉంది.
ఐఓఎస్ 10, 11 ఓఎస్‌లు ప్రస్తుతం ఐఫోన్ 5, 5సి ఫోన్లలో ఉన్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. వాట్సాప్ నుంచి వచ్చే అప్ డేట్స్‌ను ఈ ఫోన్లను వాడుతున్నవారు ఇన్‌స్టాల్ చేసుకోలేరు. ఈ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ లభించదు. కనుక ఈ ఫోన్లను వాడుతున్న వారు ఐఓఎస్ 12 ఉండే ఐఫోన్ 5ఎస్, 6, 6ఎస్ ఫోన్లను అయినా వాడాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్‌ను ఉపయోగించుకోలేరు.
ఇక వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే వస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే మరిన్ని ఫీచర్లను అందించనుంది. లీవ్ గ్రూప్స్ సైలెంట్లీ, రిచ్ లింక్ ప్రివ్యూస్, కంపానియన్ మోడ్, సెర్చ్ ఫిల్టరింగ్ వంటి పలు ఫీచర్లను వాట్సాప్ రానున్న రోజుల్లో అందించనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…