Rakul Preet Singh : టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదగిన నటి రకుల్ ప్రీత్ సింగ్. కుర్ర హీరోయిన్ల రాకతో ఈ సీనియర్ హీరోయిన్‌కు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ ఈమె హిందీలో వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇక ఈ మధ్యే రన్‌వే 34 అనే సినిమా ద్వారా ఈమె మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఈ సినిమా విడుదల సందర్బంగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
రకుల్ ప్రీత్ సింగ్ గతేడాది తాను జాకీ భగ్నాని అనే హిందీ నిర్మాతతో లవ్‌లో ఉన్నట్లు చెప్పిన విషయం విదితమే. అయితే దీనిపైనే ఆమె మాట్లాడింది. తాను తన ప్రియుడి గురించి ముందే చెప్పానని.. లేదంటే మీడియా వారు ఉన్నవి లేనివి కల్పించి రాస్తారని.. అది తనకు ఇష్టం లేదని ఈ అమ్మడు తెలియజేసింది. ఇక సెలబ్రిటీని కనుక సహజంగానే తన వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడాలని చాలా మంది అనుకుంటారని.. కానీ తమ వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోవద్దని.. తమ సినిమాల గురించి మాట్లాడుకోవాలని.. ఆమె హితవు పలికింది.
ఇక జాక్నీ భగ్నానికి, తనకు మధ్య బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు వివరించింది. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. అన్న ప్రశ్నకు మాత్రం ఈ బ్యూటీ సమాధానం చెప్పలేదు. జీవితంలో అన్న, అక్క, చెల్లి, తండ్రి, తల్లి.. ఎలాగో భర్త కూడా అలాగేనని.. త్వరలో తాము పెళ్లి చేసుకుంటే తమ గురించి ఎలాంటి నెగెటివ్ వార్తలు రావొద్దని.. అందుకనే జాకీ భగ్నాని గురించి ముందుగానే చెప్పానని రకుల్ స్పష్టం చేసింది. ఇక ఈమె ప్రస్తుతం మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జి, థాంక్ గాడ్, అలయాన్ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…