Sitara Ghattamaneni : టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన అందంతో, అభినయంతో అందర్నీ చూపులు తిప్పుకోకుండా కట్టి పడేస్తుంటాడు. ఇటీవలే వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్ మరింత గ్లామర్ లుక్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యారో ఆయన గారాల పట్టి కూతురు సితార ఘట్టమనేని కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఓఒక విషయంపై వార్తల్లో మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. సితార గురించి మరొక విషయం వార్తల్లో వైరల్ అవుతుంది. తాజాగా సితార ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పింది. ఈ విషయమై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సితార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. సితారకు సమంత అంటే ఎంతో ఇష్టం అని, నటి సమంతతో ప్రతి క్షణం గడపడం చాలా హ్యాపీగా ఉంటుందని చెబుతోంది సితార. బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో తన తండ్రి మహేష్ బాబుతో పనిచేస్తున్నప్పుడు సెట్స్‌లో సమంతతో కలిసి సరదాగా గడిపానని సితార తెలియజేసింది. సమంతతో కలిసి టైమ్ స్పెండ్ చేయటం నాకు ఇష్టం అని సితార చెప్పుకొచ్చింది. మహేష్ బాబు కూతురు సితార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సామ్ ఆంటీ నాకు మంచి స్నేహితురాలి లాంటి వారు. 6 ఏళ్ల క్రితం బ్రహ్మోత్సవం సెట్స్‌లో సరదాగా గడిపినప్పుడు సమంతతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చాలా సరదాగా అనిపించింది.. అని సితార ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
మే 12న విడుదలైన సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన పాటల ఆల్బమ్ పెన్నీ ప్రమోషనల్ వీడియోలో కనిపించి అందరిని ఆకట్టుకుంది సితార. ఈ పాటతో గత కొంత కాలంగా సితార తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేయనుందని ప్రచారం జోరుగా జరుగుతోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…