Shriya Saran : ఒకప్పుడు స్టార్ హీరోలు అందరి సరసన నటించి సందడి చేసిన శ్రియ కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకోవడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం కూడా జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి సినిమాలు చేస్తున్న శ్రియ త్వరలో గమనం చిత్రంతో ప్రేక్షకులని పలకరించనుంది. గమనం సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా శరన్ మీడియాతో పలు విషయాలు చెప్పుకొచ్చారు.
నేను ఎంత వరకు బతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలని, సినిమాలు చేస్తూనే ఉండాలని అనుకుంటాను. సినిమాల పట్ల ఇప్పుడు నా దృక్పథం మారింది. నా కూతురు, నా ఫ్యామిలీ నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. ఇక నుంచి నేను చాలెంజింగ్ పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. నా కూతురు నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్.. అని అనకూడదు. నా పని పట్ల నేను ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను.. అని శ్రియ పేర్కొంది.
గమనం సినిమా షూటింగ్ సమయంలోనే నా ఫ్రెండ్ చనిపోయారు. అప్పుడు నా హృదయం బద్దలైపోయింది. అయినా ఆ బాధలోనే షూటింగ్ చేశాను.. అని శ్రియ పేర్కొంది. ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగా నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది. పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. బాధ్యతలు పెరిగిపోతాయి.. అని స్పష్టం చేసింది శ్రియ.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…