Allu Arjun : ఈ మధ్య స్టార్ హీరోలు తమ టీమ్ మెంబర్స్‌కి చాలా విలువైన బహుమతులను ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తమ చిత్ర యూనిట్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ హీరో ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. యూనిట్ మొత్తానికి ప్రభాస్ రిస్ట్ వాచ్ లను గిఫ్టులుగా ఇచ్చాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన సినిమాలో పని చేస్తున్న టెక్నీషియన్లందరికీ ఖరీదైన వాచ్‌లను పంపించాడని సమాచారం. దీంతో ప్రభాస్ మనసు నిజంగా చాలా పెద్దది అని ఆయనిచ్చిన గిఫ్ట్ లను చూసి యూనిట్ సభ్యులు మురిసిపోయారు.
ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా పుష్ప టీమ్ కి బంగారు ఉంగరాలను గిఫ్ట్‌లుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. పుష్ప చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా 12 మంది సిబ్బందికి ఒక తులం (10 గ్రాములు) విలువైన బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారట. ఐటమ్ సాంగ్ షూట్ చివరి రోజైన సోమవారం ఉంగరాలను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్లు, ఇతర సిబ్బందికి ఇచ్చారట.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో అల్లు అర్జున్, సమంతలపై ఈ పాటను చిత్రీకరించారు. సాంగ్‌ని త్వరగా కంప్లీట్ చేసిన క్రమంలో ఆయన ఈ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘ఆర్య, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం పుష్ప.. వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…