Shakini Dhakini : శాకిని డాకిని టైటిల్‌తో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల కిడ్నాప్ డ్రామా

November 3, 2021 11:08 AM

Shakini Dhakini : ఇద్దరు హీరోయిన్స్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సినిమా రూపొందుతుంది అంటే అభిమానుల‌లో ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రెజీనా, నివేదా థామస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుధీర్ వ‌ర్మ .. కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తొలిసారిగా డిఫరెంట్‌ స్టంట్స్‌ చేస్తున్నారు. మాతృక అయిన కొరియన్ డ్రామాలో ఇద్దరు యువకులు లీడ్ రోల్స్ ప్లే చేశారు.

Shakini Dhakini movie title announced

తెలుగు రీమేక్ లో ఆ పాత్రలను అమ్మాయిలకు అన్వయిస్తూ ఉమెన్ సెంట్రిక్ మూవీగా దీనిని మార్చాడు ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌. ఈ సినిమాకు శాకిని డాకిని అనే డిఫరెంట్ నేమ్ ఫిక్స్ చేశారు. ఓ కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్‌ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో ఈ ఇద్దరు హీరోయిన్‌ల క్యారెక్టర్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. రణరంగం లాంటి డిజాస్టర్ తరువాత దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు నిఖిల్ హీరోగా లండన్ బేస్డ్ సినిమా ఒకటి తయారవుతోంది. రవితేజ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ ఒకటి ప్రకటించారు. శాకిని డాకిని అనే చిత్రం ప్రేక్ష‌కుల‌కి కొత్త థ్రిల్ అందిస్తుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment