Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ నేడు (గురువారం మే 12, 2022) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. ఈ క్రమంలోనే యూఎస్ఏలో ఇప్పటికే సినిమాకు ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ఇండియాలోనూ ఉదయం 4 గంటలకే బెనిఫిట్ షోలను ప్రారంభించారు. దీంతో 7 గంటల వరకు రివ్యూలు వచ్చేశాయి. ఈ క్రమంలోనే మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వస్తున్నాయి. అయితే ఈ మూవీ విడుదలై ఇంకా ఒక్క రోజు కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా.. అని ప్రేక్షకులు ఆరాలు తీస్తున్నారు. అయితే దీనిపై కూడా అప్‌డేట్ వచ్చేసింది.
సర్కారు వారి పాట మూవీకి గాను మొదట్లో డిస్నీప్లస్ హాట్ స్టార్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఆ హక్కులను సాధించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. దీంతో అమెజాన్ ప్రైమ్‌లోనే సర్కారు వారి పాట రిలీజ్ కానుంది. ఇక సినిమా విడుదల అయ్యాక నెల రోజులకు.. అంటే జూన్ 12వ తేదీ తరువాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది.
అయితే సర్కారు వారి పాట సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. దీంతో ఆ టీవీలో ఈ మూవీ ప్రసారం అవుతుంది. అయితే అంతకన్నా ముందే ఓటీటీలో ఈ మూవీ వస్తుంది కనుక టీవీల్లో చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపించరు. అయినప్పటికీ మూవీ బాగుందని టాక్ వస్తుంది కనుక.. టీవీలోనూ ఈ సినిమాకు రేటింగ్స్ వస్తాయని అంటున్నారు. ఇక సర్కారు వారి పాటకు అన్ని సెంటర్లలోనూ మంచి టాక్ వస్తోంది. దీంతో మహేష్ ఇంకో హిట్ సాధించారని అంటున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…