Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట మూవీలో ఆ బ్లాక్‌కు థియేట‌ర్లు షేక్ అవ్వ‌డం ఖాయం..!

Sarkaru Vaari Paata : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన లేటెస్ట్ చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా మే 12వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కానుండ‌గా.. ప్ర‌స్తుతం చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను వేగ‌వంతం చేశారు. అందులో భాగంగానే ఇటీవ‌ల జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంత‌రం చిత్ర యూనిట్ మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది. ఇక లేటెస్ట్‌గా మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఓ మీడియా సంస్థ‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అందులో మ‌హేష్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. అయితే సినిమాలో కొన్ని సీన్లు మాత్రం అద్భుతంగా ఉంటాయ‌ని ఆయ‌న చెప్పారు. దీంతో ఆయ‌న కామెంట్స్‌పై ఇంట్రెస్ట్ పెరిగింది.

Sarkaru Vaari Paata

ఈ మూవీలో వెన్నెల కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. అయితే త‌న‌కు, వెన్నెల కిషోర్ కు మ‌ధ్య న‌డిచే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉంటుంద‌ని.. త‌మ మ‌ధ్య వ‌చ్చే కామెడీ సీన్ల‌కు ప్రేక్ష‌కులు క‌డుపుబ్బా న‌వ్వ‌డం ఖాయ‌మ‌ని.. మ‌హేష్ అన్నారు. చూస్తుంటే గ‌తంలో వీరు క‌లిసి న‌టించిన దూకుడు సినిమాలోని సీన్లు ఈ మూవీలోనూ రిపీట్ అవుతాయ‌ని తెలుస్తోంది. ట్రైల‌ర్‌లోనూ వెన్నెల కిషోర్ కామెడీ ఏంటో చూపించారు. ముఖ్యంగా ఒక సీన్ లో ఆయ‌న.. ఊరుకోండి సార్‌.. ఇప్పుడే మీకు పెళ్లి ఏంటి, మీరు ఇంకా చిన్న పిల్లాడు అయితేనూ.. అని అంటారు. దీనికి మ‌హేష్ జ‌వాబు చెబుతూ.. ఊరుకోండి.. అంద‌రూ అలాగే అంటున్నారు. మెయింటెయిన్ చేయ‌లేక దూల‌తీరిపోతోంది.. అంటూ కీర‌దోస ముక్క‌ల‌ను మ‌హేష్ క‌ళ్ల‌పై పెట్టుకుంటారు. ముఖ్యంగా ట్రైల‌ర్ ఈ సీన్ అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తోంది. ఇలాంటి సీన్లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయ‌ని మ‌హేష్ చెప్ప‌డం విశేషం.

ఇక వెన్నెల కిషోర్‌కు త‌న‌కు మ‌ధ్య న‌డిచే ట్రాక్‌, ఆయా సంద‌ర్భాల్లో వ‌చ్చే సీన్ల‌కు చెందిన బ్లాక్స్ అద్భుతంగా ఉంటాయ‌ని మ‌హేష్ చెప్పారు. కాగా ఈ సినిమాలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టించింది. మైత్రి మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ సినిమాను నిర్మించారు. దీనికి థ‌మ‌న్ సంగీతం అందించారు. ఆయ‌న కంపోజ్ చేసిన పాట‌లు అన్నీ బాగున్నాయ‌ని ఇప్ప‌టికే ప్రేక్ష‌కులు వెల్‌డ‌న్ చెప్పేశారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM