OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే.. ప్రేక్ష‌కుల‌కు సంద‌డే..!

OTT : ప్ర‌తి వారం వ‌చ్చిందంటే చాలు.. ఓటీటీల్లో కొత్త మూవీలు ఏవి విడుద‌ల అవుతాయా.. అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో క‌న్నా ఓటీటీల్లో మూవీల‌ను చూసే వారి సంఖ్యే ఎక్కువ‌గా ఉంటోంది. అందులో భాగంగానే మేక‌ర్స్ కూడా కాస్త ఎక్కువ రుసుము తీసుకుని మ‌రీ త‌మ సినిమాల‌ను ముందుగానే ఓటీటీల్లోకి విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ వారం కూడా ప‌లు సినిమాలు ఓటీటీల్లో విడుద‌ల కానున్నాయి. అవి ప్రేక్ష‌కుల‌ను అల‌రించే సినిమాలు కావ‌డం విశేషం. ఇక ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమ్ కానున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

OTT

త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌, బుట్ట‌బొమ్మ పూజా హెగ్డె న‌టించిన బీస్ట్ మూవీ ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమ్ కానుంది. మే 11న స‌న్ నెక్ట్స్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అంత‌గా విజ‌యం సాధించ‌లేదు. ఓ ద‌శ‌లో విజ‌య్ ఫ్యాన్స్ చెన్నైలో ఓ థియేట‌ర్‌లో తెర‌ను త‌గుల‌బెట్టారు. దీంతో సినిమాకు ఏవిధ‌మైన నెగెటివిటీ వ‌చ్చిందో అర్థ‌మైంది. అయితే ఓటీటీలో అయినా ఈ మూవీ అల‌రిస్తుందో.. లేదో.. చూడాలి.

ఇక దేశ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఎట్ట‌కేల‌కు ఓటీటీల్లోకి రానుంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఘ‌న విజ‌యం సాధించింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండానే విడుద‌లైన ఈ మూవీ కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి అంద‌రికీ షాకిచ్చింది. ఈ మూవీని జీ5 ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్ చేయ‌నున్నారు. మే 13వ తేదీన ఈ యాప్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

అలాగే ది మ్యాట్రిక్స్ రిస‌రెక్ష‌న్స్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు బుక్ మై షో, గూగుల్ ప్లే మూవీస్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. అయితే ఈ సినిమాను చూడాలంటే పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో డ‌బ్బులు చెల్లించాలి. ఈ సినిమా తెలుగు, హిందీలోనూ అందుబాటులోకి రానుంది.

ది సావేజ్ బ్యూటీ అనే ఇంగ్లిష్ డ్రామా మూవీని సైతం ఈ వార‌మే ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో మే 12వ తేదీ నుంచి ఈ మూవీని చూడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM