Ira Khan : బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్ కానీ.. ఆయన కుమార్తె ఇరా ఖాన్ కానీ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అమీర్‌ఖాన్ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. అయితే ఆయన కొన్నిసార్లు చేసే వ్యాఖ్యలు.. చేసే పనులు వివాదాస్పదం అవుతుంటాయి. అలాగే ఆయన కుమార్తెను కూడా నెటిజన్లు ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇరా ఖాన్ మరోమారు విమర్శల పాలవుతోంది. తన బర్త్ డే సందర్భంగా ఆమె బికినీ ధరించి తండ్రి అమీర్‌ఖాన్ పక్కనే ఉండి కేక్ కట్ చేసింది. అయితే అంతా బాగానే ఉంది. కానీ ఆమె అలా బికినీ ధరించడంపైనే నెటిజన్లు ఫైరవుతున్నారు.
ఆదివారం ఇరాఖాన్ తన 25వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది. చూస్తుంటే ఏదో రిసార్ట్‌లోనో.. హోటల్‌లోనూ అమీర్‌ఖాన్ కుటుంబం మొత్తం ఉన్నట్లు ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. అక్కడే ఇరాఖాన్ వెంటే బాయ్ ఫ్రెండ్ నుపుర్ శిఖరే, సోదరుడు ఆజాద్ రావ్ ఖాన్‌లు కూడా ఉన్నారు. అయితే ఆమె బర్త్ డే వేడుక సందర్భంగా కేక్ కూడా కట్ చేసింది. అందరూ స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా గడుపుతూ ఈ వేడుకలో పాల్గొనట్లు అర్థమవుతోంది. అయితే ఇరాఖాన్ మాత్రం బికినీలో అందాలను ప్రదర్శిస్తూ కనిపించింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు సిగ్గులేదా.. కనీసం మంచి బట్టలు అయినా వేసుకోవచ్చు కదా.. అంటూ విమర్శిస్తున్నారు.
అయితే ఇరాఖాన్ ఇటీవల రంజాన్ సందర్భంగా కూడా ఓ డ్రెస్ ధరించగా.. అది కూడా గ్లామర్‌గానే ఉంది. దీంతో ఆమెను అప్పుడు ట్రోల్ చేశారు. అది జరిగి కనీసం వారం కూడా కాకముందే మళ్లీ ఆమె ఇలా కనిపించడంతో మరోమారు నెటిజన్లు తమదైన శైలిలో ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇక ఇరాఖాన్ తనకు మానసిక వ్యాధి ఉందని.. సడెన్‌గా ఆందోళనకు గురవుతానని.. గతంలో ఎన్నోసార్లు చెప్పింది. కాగా అమీర్‌ఖాన్ ఇటీవలే తన భార్య కిరణ్ రావ్‌కు విడాకులు ఇచ్చిన విషయం విదితమే. ఆయన ఇంకో హీరోయిన్‌తో రిలేషన్‌షిప్ లో ఉన్నారని.. అందుకనే విడాకులు ఇచ్చి ఉంటారని బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అమీర్‌ఖాన్ త్వరలో లాల్ సింగ్ చడ్డా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…