Sara Tendulkar : క్రికెట్, సినిమా రంగాలకి చెందిన ప్రముఖుల పిల్లలు వెండితెర ఎంట్రీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. కొంతమంది సక్సెస్ అయ్యారు. మరి కొంత మంది నిరాశపరిచారు. అయితే క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా కూడా ఇప్పుడు వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీ కిడ్ అయిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది.
సారా టెండూల్కర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్ల ఫాలోవర్లున్నారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సారా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బీటౌన్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సారా హిందీలో డెబ్యూ మూవీ చేసేందుకు రెడీ అవుతోందట. సినిమాల్లో నటించాలనే తన కోరికకు సారా టెండూల్కర్ తల్లిదండ్రులు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ సినిమా ద్వారా సారా హీరోయిన్ గా అరంగేట్రం చేయనుందని తెలుస్తోంది. అయితే దీనిపై సారా తండ్రి సచిన్ స్పందించారు. అది పుకారేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం తన కుమార్తె విద్యాభ్యాసం చేస్తోందని.. ఇప్పటికైతే సినిమాల్లో నటించే అవకాశం లేదని సచిన్ అన్నారు. యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో సారా టెండూల్కర్ ప్రేమాయణం సాగిస్తుందని గతంలో ప్రచారం జరిగింది. వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…