Sara Tendulkar : సినిమాల్లో ఎంట్రీకి సచిన్ టెండూల్క‌ర్ కుమార్తె రెడీ..?

April 25, 2022 9:44 PM

Sara Tendulkar : క్రికెట్, సినిమా రంగాల‌కి చెందిన ప్ర‌ముఖుల పిల్ల‌లు వెండితెర ఎంట్రీ ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖులు తమ అదృష్టాన్ని ప‌రీక్షించుకోగా.. కొంత‌మంది స‌క్సెస్ అయ్యారు. మ‌రి కొంత మంది నిరాశ‌ప‌రిచారు. అయితే క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ కూతురు సారా కూడా ఇప్పుడు వెండితెర ఎంట్రీ ఇవ్వ‌బోతున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. సెల‌బ్రిటీ కిడ్ అయిన ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల సంఖ్య భారీగానే ఉంది.

Sara Tendulkar reportedly making her Bollywood debut
Sara Tendulkar

సారా టెండూల్క‌ర్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లున్నారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. సారా సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతుంద‌న్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బీటౌన్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం సారా హిందీలో డెబ్యూ మూవీ చేసేందుకు రెడీ అవుతోంద‌ట‌. సినిమాల్లో నటించాలనే తన కోరికకు సారా టెండూల్కర్ తల్లిదండ్రులు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ నటుడు షాహిద్ కపూర్ సినిమా ద్వారా సారా హీరోయిన్ గా అరంగేట్రం చేయనుందని తెలుస్తోంది. అయితే దీనిపై సారా తండ్రి సచిన్ స్పందించారు. అది పుకారేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం తన కుమార్తె విద్యాభ్యాసం చేస్తోందని.. ఇప్పటికైతే సినిమాల్లో నటించే అవకాశం లేదని సచిన్ అన్నారు. యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో సారా టెండూల్కర్ ప్రేమాయణం సాగిస్తుందని గతంలో ప్రచారం జరిగింది. వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment