Samantha : స‌మంత‌కు అదిరిపోయే ఆఫ‌ర్.. ఆశ్చ‌ర్య‌పోతున్న అభిమానులు..

November 14, 2021 10:23 AM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత క్రేజే వేరు. పెళ్లైన త‌ర్వాత ఈ అమ్మడికి ఆఫ‌ర్స్ తగ్గ‌లేదు. విడాకుల త‌ర్వాత కూడా స‌మంత క్రేజ్‌పై ఎలాంటి ఎఫెక్ట్ ప‌డ‌లేదు. వ‌రుస ఆఫ‌ర్స్ ఈ అమ్మ‌డిని ప‌ల‌క‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌కు సైన్ చేసిన స‌మంత త్వ‌ర‌లో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేయ‌నుంద‌ని స‌మాచారం. స‌మంత.. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక చిత్రం శాకుంతలంలో నటించ‌గా.. ఈ మూవీ విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.

Samantha may get another chance in rajamouli film

సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”తో బిజీగా ఉండగా, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇందులో స‌మంత‌ని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని రాజ‌మౌళి భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

సాధార‌ణంగా రాజమౌళి తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడు. ఒక్క అనుష్కతోనే రాజమౌళి మూడు సినిమాలు చేశాడు. ఇక గతంలో రాజమౌళి చేసిన ‘ఈగ’ సినిమాలో సామ్ కన్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో ఆమెకు పాన్ ఇండియా క్రేజ్ వ‌చ్చిన నేప‌థ్యంలో స‌మంత‌ను తీసుకోవాల‌ని మ‌హేష్ భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now