Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. కొద్ది రోజుల పాటు ఆమె ఒత్తిడి అంతా పోయేందుకు టూర్లు వేసింది. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సందేశాలు ఇస్తోంది. ఇక తాజాగా దీపావళి సందర్భంగా సమంత.. పెద్దవాళ్లకు మాత్రమే అంటూ.. పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్‌గా మారింది. ఇంతకీ అందులో ఏముందంటే..
దీపావళి పండుగ అనగానే ప్రతి ఒక్కరికీ పటాకులు గుర్తుకు వస్తాయి. చిన్నారులు బాణసంచా కాల్చేందుకు మిక్కిలి ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ట్విట్టర్‌లో వీడియో సందేశం ఇచ్చారు. దాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
చిన్నతనంలో దీపావళికి బాంబులు కాల్చాలని ఎంతో ఇష్టం ఉండేదని, కానీ తనకు ఆ పని సాధ్యం కాలేదని జగ్గీ వాసుదేవ్ చెప్పారు. అయితే చిన్నారుల కోసమైనా బాణసంచాపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని, వారి ఆనందానికి అడ్డుకట్ట వేయొద్దని ఆయన కోరారు.
అయితే మరి పర్యావరణ కాలుష్యం ఎలా ? అంటే.. అందుకు ఆయన ఓ సలహా ఇచ్చారు. దీపావళికి కాలుష్యం బాగా పెరిగిపోతుంది కనుక కొన్ని రోజులు పెద్దవారు వాహనాలను వాడడం మానేయండి. కాలినడకన వెళ్లండి. లేదంటే ప్రజా రవాణాను ఉపయోగించండి. దీంతో కాలుష్యం తగ్గుతుంది. అంతేకానీ కాలుష్యం పేరు చెప్పి దీపావళి రోజు చిన్న పిల్లల సరదాలను, ఆనందాలను దూరం చేయొద్దని ఆయన కోరారు.
ఇక సమంత కూడా ఆయన చెప్పిన మాటలకు చెందిన వీడియోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడమే కాక.. ఆమె కూడా దీపావళి క్రాకర్స్‌ను బ్యాన్ చేయవద్దని కోరింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. పెద్దవాళ్లు కొన్ని రోజులు ఆ విధంగా చేస్తే మంచిదని సూచిస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…