Samantha : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా సాధారణ అమ్మాయిలా కాకుండా నిత్యం ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ.. వాటిని ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్‌లోనూ షేర్ చేస్తూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటూ ఉంటోంది సమంత.
సమంత ప్రస్తుతం నేషనల్ లెవెల్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో సమంతకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అలాగే పుష్పలోని ఐటం సాంగ్ ఊ అంటావా మావా.. అనే పాట వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. అలా సమంత క్రేజ్ వరల్డ్ వైడ్‌గా పెరిగింది. దీంతోపాటు సమంత సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రస్తుతం అనేక సినిమాలతో బిజీగా ఉన్న సామ్ సమయం దొరికినప్పుడల్లా వస్త్ర దుకాణాల ప్రారంభోత్సవానికి వెళ్తుంటుంది. అయితే సమంత స్టార్ హీరోయిన్ కాబట్టి ఒక్కో షాప్ ఓపెనింగ్ కి ఎన్ని డబ్బులు తీసుకుంటుంది అనే ఆలోచన మనకు రాకమానదు. అయితే గతంలో సమంత నల్గొండలోని మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించింది. ఈ షాప్ ఓపెనింగ్ కి చాలా తక్కువ తీసుకుంటున్నట్టు తెలిపింది. సామ్ ఓ షాప్ ఓపెనింగ్ కి రూ.15 నుంచి రూ.20 లక్షలు మాత్రమే తీసుకుందట. నిజానికి స్టార్ హీరోయిన్స్ ఇలాంటి ఫంక్షన్స్ కి చాలా పెద్ద మొత్తం డిమాండ్ చేస్తారు కానీ సామ్ ఎందుకో తక్కువ తీసుకుందట.
ప్రస్తుతం సమంత హీరోయిన్ గా కంటే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. యశోద, శాకుంతలంతోపాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి, మరో హాలీవుడ్ మూవీ అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ లో కూడా నటిస్తోంది సమంత.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…