Bimbisara 1st Day Collections : బింబిసార తొలి రోజు క‌లెక్ష‌న్స్ వివ‌రాలు.. క‌ల్యాణ్ రామ్ ల‌క్ మామూలుగా లేదు..

Bimbisara 1st Day Collections : నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స్వ‌యంగా నిర్మించి న‌టించిన చిత్రం.. బింబిసార‌. త‌న ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ల్యాణ్ రామ్ ఈ మూవీని నిర్మించారు. సుమారుగా రూ.40 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన ఈ మూవీకి తొలి రోజు క‌లెక్ష‌న్స్ బాగానే వ‌చ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శుక్ర‌వారం ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. చాలా రోజుల త‌రువాత క‌ల్యాణ్ రామ్ మూవీకి ఇంతటి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ కల్యాణ్ రామ్ కు మాత్ర‌మే కాకుండా.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు సైతం ఊపిరి పీల్చుకునేలా చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక బింబిసార మూవీకి తొలి రోజు తెలంగాణ‌లో రూ.2.12 కోట్ల షేర్ వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి మొత్తం రూ.6 కోట్ల షేర్‌ను ఈ మూవీ సాధించింది. దీంతో బింబిసార బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన‌ట్లేన‌ని అంటున్నారు. ఈ మూవీ ఇంకో నాలుగు రోజులు ఇలాగే న‌డిస్తే పెట్టిన బ‌డ్జెట్ మొత్తం వ‌స్తుంద‌ని.. ఆ త‌రువాత వ‌చ్చేదంతా లాభ‌మే అని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ ఫీట్‌ను మూవీ అవ‌లీల‌గా సాధించ‌గ‌ల‌దు. దీంతో క‌ల్యాణ్ రామ్ ద‌శ తిరిగిపోయింద‌ని.. ఆయ‌న‌కు ల‌క్ మామూలుగా లేద‌ని అంటున్నారు.

Bimbisara 1st Day Collections

చాలా రోజుల త‌రువాత క‌ల్యాణ్ రామ్ హిట్ సాధించ‌గా.. అస‌లే డీలా ప‌డిపోయి ఉన్న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు బింబిసార మూవీ ఊపిరి పోసింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మూవీకి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. కాలంలో ప్ర‌యాణించ‌డం (టైమ్ ట్రావెల్‌) అనే కాన్సెప్ట్‌తో వ‌చ్చిన మూవీ కావ‌డంతో స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంటుంది. గ‌తంలో ఆదిత్య 369 మూవీని కూడా ఇదే కాన్సెప్ట్‌తో తీశారు. ఇప్పుడదే అంశంతో క‌ల్యాణ్ రామ్ ఈ మూవీని తెర‌కెక్కించారు. దీంతో ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఇక మొత్తంగా ఈ మూవీ చివ‌ర‌కు ఎంత వ‌సూలు చేస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM